
'అమ్మ' మొక్కు చెల్లించిన మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో అన్నాడీఎంకే పార్టీ నార్త్-సౌత్ తిరువాతినాగర్ దిగాల్ మాజీ ఎమ్మెల్యే వడివేలు నీలకంఠం మొక్కు తీర్చుకున్నారు. జయలలిత తమిళనాడు సీఎం కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు శనివారం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 'అమ్మ' మొక్కును చెల్లించుకున్నారు. 66 కేజీల 543 గ్రాముల 860 మిల్లీల బరువు గల వెండి పూజా సామాగ్రిని స్వామివారి మూలమట్టం వెండి హారతి పళ్లెంలు, వెండి తాంబూలం తట్టలు, వెండి బిందెను ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేశారు. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని వడివేలు నీలకంఠం శ్రీకాళహస్తి ఆలయంలో మొక్కుకున్నారు.
అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ.. సుమారు వీటి విలువ రూ. 32 లక్షల 66వేల 439 ఉంటుందని వెల్లడించారు. అనంతరం ఆయనకు శ్రీకాళహస్తి ఆలయ ఈవో.. స్వామి, అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేసి దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి వారికి తీర్ధప్రసాదాలు ఇచ్చారు.