చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో పెను ప్రమాదం తప్పింది.
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఆలయం ప్రాంగణంలోని అన్నదానం మండపంలో బాయిలర్ పేలింది. దీంతో అక్కడున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
ఘటనా స్థలం సమీపంలో 40 సిలిండర్లు ఉన్నాయి. వంట చేయడం కోసం వీటిని అక్కడ ఉంచారు. బాయిలర్ పేలిన ఘటనలో మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.