2024 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్' కొత్త నాణ్యతా ప్రమాణాల కారణంగా పాదరక్షలు (చెప్పులు, షూస్) ఖరీదైనవిగా మారుతాయి. పాదరక్షల తయారీదారులు ఐఎస్ 6721 & ఐఎస్ 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ వెల్లడించింది.
పాదరక్షల క్వాలిటీ పెరిగితే ధర పెరుగుతుంది. అయితే రూ. 50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన తయారీదారులకు బీఐఎస్ ఈ నియమం నుండి మినహాయింపు కల్పించింది. ఇప్పటికే తయారు చేసిన పాత స్టాక్‌కు కూడా ఈ నియమం వర్తించదు. అయితే విక్రయదారులు బీఐఎస్ వెబ్‌సైట్‌లో పాత స్టాక్ వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 1 నుంచి 46 అంశాలు సవరించిన బీఐఎస్ నిబంధనల పరిధిలోకి వస్తాయి. కంపెనీలకు అవగాహన కల్పించడం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేసినట్లు బీఐఎస్ తెలిపింది. ప్రధానంగా రెక్సిన్, ఇన్సోల్, లైనింగ్ వంటి పాదరక్షలలో ఉపయోగించే ముడి పదార్థాలు రసాయన లక్షణాలను కంపెనీలు పరీక్షించాల్సి ఉంటుంది.
త్వరలో అమలులోకి రానున్న కొత్త రూల్స్ చెప్పులను బలంగా, మన్నికైనవిగా చేస్తాయి. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధరల పెరుగుదల ఎంత వరకు ఉంటుందనేది.. ఆగష్టు 1 తరువాత తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment