
చెప్పులతోనే పూజలుచేస్తున్న అధికారులు
యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శివాలయం పనుల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వార తోరణ పూజలను కొందరు వైటీడీఏ, దేవస్థానం అధికారులు పాదరక్షలు ధరించి పూజ లను నిర్వహించారు.
దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారులు ఇలా తప్పుడు పనులు చేస్తూ యాదాద్రి ప్రతిష్టను మంటగలుపుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
పవిత్రంగా నిర్వహించాల్సిన ఈ శిలాన్యాస పూజలను అధికారులు అపవిత్రంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులతో శిలాన్యాస పూజల్లో పాల్గొంటున్నా.. పక్కన ఉన్న ఇతర అధికారులు వారించకపోవడంపై విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment