worshipped
-
కల్కి అవతారమంటూ బాలుడికి పూజలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఓ బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వైఖరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీపీసీఆర్) స్వయంగా కేసు నమోదు చేసింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో శ్రీ వైకుంఠ ధామం ప్రాంగణంలో బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్న ప్రసారం ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దుమారం తార స్థాయికి తాకింది. బాలల హక్కుల సంఘం ఈ మేరకు సమగ్ర నివేదిక దాఖలు చేయాలని భరత్పూర్ ఠాణా పోలీసులకు తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు 15 రోజుల గడువు మంజూరు చేసింది. బాలల సంక్షేమ కమిటి ఈ ప్రసారంపై విచారణ చేపట్టాలని ఎస్సీపీసీఆర్ ఆదేశించింది. వివాదంలో చిక్కుకున్న కల్కి అవతార బాలుడు ప్రముఖ భాష్యకారుడు కాశీనాథ్ మిశ్రా కుమారుడు. సాంఘిక మాధ్యమంలో ప్రసారమైన ఫొటోలు అభూత కల్పనగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలపై లోతుగా విచారణ చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యరి్థంచారు. -
వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి?
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం గణేశ చతుర్థి. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ఈ స్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయని ప్రతీతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు గురించి కొన్ని విశేషాలు... చదవండి: పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా.. వినాయకుడికి, విద్యకు సంబంధం ఏమిటి? చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. ‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతావా!’ అని అడిగాడట.‘అలాగే రాస్తాను కానీ, మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి. ‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు. అలా సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది. వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా అనుకోకుండా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది! తన నిబంధన ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని విచారించాడట వ్యాసుడు. సరే తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలిసుండాలి. అంటే వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. వారికి సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. నాటినుంచి వినాయక చవితినాడు చేసే పూజలో పిల్లలు తమ పుస్తకాలను, కలాలను ఉంచి, పుస్తకాలకు పసుపు కుంకుమలు అలంకరించి పూజించడం ఆచారంగా మారింది. క్షేమం, లాభం కూడా.. ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. వీటిలోని ఆంతర్యం ఇదే! వినాయకుని నక్షత్రం ‘హస్త’. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, ఉండ్రాళ్లుగా తయారు చేసి చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి నివేదన చేస్తారు. పత్రిపూజ: అదేవిధంగా వినాయకునిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రీతికరమైనది. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. మూషిక వాహనం: మూషికం అంటే ఎలుక వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. పంజరంలో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పట్టినప్పుడు మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు – వినాయకుడు. చదవండి: గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము -
ఓర్వకల్లులో క్షుద్ర పూజలు
గుంటూరు, ఓర్వకల్లు(అచ్చంపేట): నడిరోడ్డుపై క్షుద్ర పూజలతో పాటు గోతిలో పంది పిల్లను తల ఒక్కటే బయటకు కనిపించేలా పూడ్చి పెట్టిన సంఘటన మండలంలోని ఓర్వకల్లు, రుద్రవరం గ్రామాల మధ్యలో పొలిమేర వద్ద శ్మశానానికి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఆయా గ్రామాల ప్రజలు చూసి విస్తుబోయారు. క్షుద్రపూజలు జరిపిన స్థలంలో నిమ్మకాయలు పిండటంతో పాటు పసుపు, కుంకమలతో వికృతంగా ఉండే ఒక బొమ్మకు పూజలు నిర్వహించినట్లు స్పష్టంగా ఆనవాళ్లు కనిపించాయి. పూజలు జరిపిన ఐదు అడుగుల దూరంలో రోడ్డు మధ్యలో గుంత తీసి అందులో జీవం ఉన్న పంది పిల్లను తల కనిపించేలా పూడ్చి పెట్టారు. పూజలు అర్ధరాత్రి సమయంలో చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో గొర్రెలు, పొట్టేళ్లు, మేకలు తరచూ మరణిస్తుండటంతో జీవాల కాపరులు శాంతి కోసం అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి ఇలా చేశారని గ్రామంలో పుకార్లు వినిపిస్తున్నాయి. -
పాదరక్షలతోనే పూజలు
యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శివాలయం పనుల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వార తోరణ పూజలను కొందరు వైటీడీఏ, దేవస్థానం అధికారులు పాదరక్షలు ధరించి పూజ లను నిర్వహించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారులు ఇలా తప్పుడు పనులు చేస్తూ యాదాద్రి ప్రతిష్టను మంటగలుపుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పవిత్రంగా నిర్వహించాల్సిన ఈ శిలాన్యాస పూజలను అధికారులు అపవిత్రంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులతో శిలాన్యాస పూజల్లో పాల్గొంటున్నా.. పక్కన ఉన్న ఇతర అధికారులు వారించకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. -
రైల్వేస్టేషన్లో దుర్గమ్మ దర్శనం
విజయవాడ(రైల్వే స్టేష): యాత్రికుల సౌకర్యార్థం దుర్గామలేశ్వర దేవస్థాన అధికారులు రైల్వేస్టేçÙన్ ఆవరణలో దుర్గమ్మ ప్రతిమ ఏర్పాటు చేశారు. అమ్మ దర్శనానికి వెళ్లలేని పలువురు యాత్రికులు స్టేషన్లో దర్శనం చేసుకుంటున్నారు. దేవస్థాన ప్రసాదం కౌంటర్లలో లడ్డు, పులిహోర 24 గంటలు విక్రయిస్తున్నారు. దేవస్థాన అధికారుల ఏర్పాట్లపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.