ఓర్వకల్లులో క్షుద్ర పూజలు | Worshiping In Orvakallu Guntur | Sakshi
Sakshi News home page

ఓర్వకల్లులో క్షుద్ర పూజలు

Oct 9 2018 1:42 PM | Updated on Oct 9 2018 1:42 PM

Worshiping In Orvakallu Guntur - Sakshi

క్షుద్రపూజలు చేసిన ప్రాంతం తల కనిపించేలా భూమిలో పూడ్చి పెట్టిన పందిపిల్ల

గుంటూరు, ఓర్వకల్లు(అచ్చంపేట): నడిరోడ్డుపై క్షుద్ర పూజలతో పాటు గోతిలో పంది పిల్లను తల ఒక్కటే బయటకు కనిపించేలా పూడ్చి పెట్టిన సంఘటన మండలంలోని ఓర్వకల్లు, రుద్రవరం గ్రామాల మధ్యలో పొలిమేర వద్ద శ్మశానానికి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఆయా గ్రామాల ప్రజలు చూసి విస్తుబోయారు. క్షుద్రపూజలు జరిపిన స్థలంలో నిమ్మకాయలు  పిండటంతో పాటు పసుపు, కుంకమలతో వికృతంగా ఉండే ఒక బొమ్మకు పూజలు నిర్వహించినట్లు స్పష్టంగా ఆనవాళ్లు కనిపించాయి. పూజలు జరిపిన ఐదు అడుగుల దూరంలో రోడ్డు మధ్యలో గుంత తీసి అందులో జీవం ఉన్న  పంది పిల్లను తల కనిపించేలా పూడ్చి పెట్టారు. పూజలు అర్ధరాత్రి సమయంలో చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో గొర్రెలు, పొట్టేళ్లు, మేకలు తరచూ మరణిస్తుండటంతో జీవాల కాపరులు శాంతి కోసం అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి ఇలా చేశారని గ్రామంలో పుకార్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement