బెంగళూరు: దక్షిణ కర్ణాటకలోని కరింజ ఆలయ ప్రాంగణంలోకి పాదరక్షలు తీయకుండా ప్రవేశించినందుకు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కరింజ ఆలయ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు వినయ్ కుమార్ ఫిర్యాదుతో పుంజల్‌కట్టె పోలీసులు నలుగరుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితులు మస్తికట్టె ఉల్లాల్‌కు చెందిన బుషర్ రెహ్మాన్ (20), ఉల్లాల్ ముక్కచెరి హౌస్‌కు చెందిన ఇస్మాయిల్ అర్హమాజ్ (22), హళేకోట్ హౌస్ ఉల్లాల్‌కు చెందిన మహమ్మద్ తనీష్(19), బబ్బుకట్టె పెర్మన్నూరుకు చెందిన మహ్మద్ రషాద్(19)గా పోలీసులు గుర్తించారు.
చదవండి: రెండున్నర లక్షలు మాయం.. డబ్బుకోసం వెతుకుతుండగా బాత్రూంలోకి వెళ్లి..
అయితే నిందితులు పాదరక్షలు తీయకుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు ఓ వైరల్ వీడియో వైరల్ కావటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అరెస్టు చేసిన వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన తమ మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందని భక్తులు ఖండించారు. ఆలయాల పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, ఆలయాలకు రక్షణ కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment