ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..? | Whats Up With Aussies Many Australians Have No Footwear | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?

Published Wed, May 15 2024 1:45 PM | Last Updated on Wed, May 15 2024 1:50 PM

Whats Up With Aussies Many Australians Have No Footwear

ఈ రోజుల్లో కాళ్లకు చెప్పులు లేకుండా ఎవ్వరు కనిపించరు. ఆఖరికి బిచ్చగాడి దగ్గర నుంచి ధనికులు వరకు వాళ్లకు తగ్గ రేంజ్‌లో చెప్పులు ధరించడం జరుగుతుంది. పొరపాటున చెప్పు తెగితే ఉత్త కాళ్లతో నడిచే వాళ్లు కనిపిస్తారేమో గానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్లు ఎవరుండరనే చెప్పొచ్చు. ఇప్పుడున్న కాలుష్యం రోడ్ల మీద ఉండే చెత్త చెదారాల రీత్యా చెప్పులు లేకుండా నడవటం అంత ఈజీ కాదు. కానీ ఆస్ట్రేలియాలో ఏమయ్యిందో గానీ ప్రజలంతా విచిత్రంగా బిహేవ్‌ చేస్తున్నారు.

ఏంటంటే..
అక్కడున్న వాళ్లంతా చెప్పులు లేకుండానే రోడ్లపై తిరుగుతూ కనిపించారు. బ్రాండెడ్‌ షూస్‌, రకరకాల డిజైనర్‌ చెప్పులు ధరించే వాళ్లు కాస్త ఒక్కసారిగా ఇలా పాదరక్షలు లేకుండా కనిపించారు. అయితే అక్కడ రోడ్లన్ని నీటిగా ఉంటాయి కాబట్టి వాళ్లు ఈజీగా నడుచుకుంటూ పోగలరు. ఇలా మన భారత్‌లో మాత్రం సాధ్యం కాదు. ధూళి, ఇతర గాజులాంటివి రోడ్ల మీద దర్శనమిస్తాయి కాబట్టి అలా నడిచే సాహసం చేయడం కాస్త కష్టమే.

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఔను! అలా పాదరక్షలు లేకుండా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిదే అని కొందరూ కామెంట్‌ చేయగా, మరికొందరూ మాత్రం మన దేశంలో కూడా ఇలా హాయిగా చెప్పులు లేకుండా నడిచేలా రహదారులు ఉంటే బాగుండును అని పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: సూపర్‌ మామ్స్‌! రికార్డుల సృష్టించిన తల్లులు)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement