australians
-
ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
ఈ రోజుల్లో కాళ్లకు చెప్పులు లేకుండా ఎవ్వరు కనిపించరు. ఆఖరికి బిచ్చగాడి దగ్గర నుంచి ధనికులు వరకు వాళ్లకు తగ్గ రేంజ్లో చెప్పులు ధరించడం జరుగుతుంది. పొరపాటున చెప్పు తెగితే ఉత్త కాళ్లతో నడిచే వాళ్లు కనిపిస్తారేమో గానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్లు ఎవరుండరనే చెప్పొచ్చు. ఇప్పుడున్న కాలుష్యం రోడ్ల మీద ఉండే చెత్త చెదారాల రీత్యా చెప్పులు లేకుండా నడవటం అంత ఈజీ కాదు. కానీ ఆస్ట్రేలియాలో ఏమయ్యిందో గానీ ప్రజలంతా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు.ఏంటంటే..అక్కడున్న వాళ్లంతా చెప్పులు లేకుండానే రోడ్లపై తిరుగుతూ కనిపించారు. బ్రాండెడ్ షూస్, రకరకాల డిజైనర్ చెప్పులు ధరించే వాళ్లు కాస్త ఒక్కసారిగా ఇలా పాదరక్షలు లేకుండా కనిపించారు. అయితే అక్కడ రోడ్లన్ని నీటిగా ఉంటాయి కాబట్టి వాళ్లు ఈజీగా నడుచుకుంటూ పోగలరు. ఇలా మన భారత్‌లో మాత్రం సాధ్యం కాదు. ధూళి, ఇతర గాజులాంటివి రోడ్ల మీద దర్శనమిస్తాయి కాబట్టి అలా నడిచే సాహసం చేయడం కాస్త కష్టమే.అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఔను! అలా పాదరక్షలు లేకుండా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిదే అని కొందరూ కామెంట్ చేయగా, మరికొందరూ మాత్రం మన దేశంలో కూడా ఇలా హాయిగా చెప్పులు లేకుండా నడిచేలా రహదారులు ఉంటే బాగుండును అని పోస్టులు పెట్టారు. Many Australians have realised that the best footwear is no footwear. We can’t do this here in India due to dirt and glass and other stuff on street, barefoot footwear is the future. pic.twitter.com/INgq1VBR02— Ganesh Sonawane (@ganeshunwired) May 14, 2024 (చదవండి: సూపర్ మామ్స్! రికార్డుల సృష్టించిన తల్లులు) -
ట్రంప్ ఆస్ట్రేలియన్లను కూడా చీల్చాడు!
కాన్బెర్రా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు మాత్రమే కాదు.. తన గురించి చర్చించుకుంటున్నవారికి తలనొప్పిగా మారారు. ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన ఏడు ముస్లిం దేశాల పౌరుల ట్రావెలింగ్ బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా వాసులు రెండుగా చీలిపోయారు. ట్రంప్‌దే కరెక్ట్ అని సగం మంది, సరికాదని మిగితా సగంమంది తగువుకు దిగారు. ఈ విషయం అక్కడ నిర్వహించిన ఓ ఆన్లైన్ సంస్థ తెలిపింది. 44శాతంమంది ఆస్ట్రేలియన్లు ట్రంప్ నిర్ణయానికి అనుకూలంగా నిలవగా 45 శాతం మంది మాత్రం వ్యతిరేకంగా నిల్చున్నారు. కన్జర్వేటివ్ ఓటర్లంతా కూడా ట్రంప్ శైలి తమకు నచ్చిందని, దానిని ప్రవేశపెడితే ఆస్ట్రేలియాలోకి కూడా వలసలు రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారంట. అలాగే, నేషనల్, లిబర్ ఓటర్లు కూడా ట్రంప్ విధానాన్ని సమర్థిస్తున్నారని కూడా ఆ సంస్థ తెలిపింది. ఇక 34శాతం ఓటర్లు ట్రంప్ కు అనుకూలంగా ఉన్నారని, అదే సమయంలో 55శాతం మంది మాత్రం ట్రంప్ విధానంపై గుర్రుగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. జర్మనీ, బ్రిటన్, కెనడా వంటి దేశాలు స్పష్టంగా ట్రంప్ విధానాన్ని తప్పుబట్టగా అమెరికా వ్యక్తిగత అంశాల్లో తాము జోక్యం చేసుకోమని, అది ఆ దేశం ఇష్టమంటూ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ స్పష్టతనివ్వకుండా సమాధానం దాటవేశారు. -
ఆస్ట్రేలియన్లను అలరించనున్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
మెల్బోర్న్: భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని, కళాకారుల నైపుణ్యాన్ని చాటడానికి మొదటిసారిగా ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ను ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, కాన్బెర్రా తదితర ప్రధాన నగరాల్లో ఆగస్టులో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని భారత హైకమిషనర్ నవ్‌దీప్ సూరి వెల్లడించారు. నాలుగు నెలలపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు, సంగీతంతోపాటు భారతీయ కళలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఆస్ట్రేలియా, ఇండియా ప్రభుత్వాలతోపాటు పలు ప్రైవేటు సంస్థల సహాయంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రదర్శనలు ఉంటాయని, ఒడిషా నర్తకి సుజతా మహాపాత్ర, రఘు దీక్షిత్ సంగీతం, అజిత్ నియాన్ కార్టూన్ ఎగ్జిబిషన్, తోలుబొమ్మలాట వంటివి ఆస్ట్రేలియన్లను అలరిస్తాయని చెప్పారు. ఈ ఉత్సవం అధికారికంగా వచ్చే నెలలో సిడ్నీలో ప్రారంభమవనుంది. -
మొసళ్లను సంహరించాలంటున్న ఆస్ట్రేలియన్లు
మెల్బోర్న్: దక్షిణ ఆస్ట్రేలియాలో నానాటికీ పెరుగుతోన్న మొసళ్ల సంఖ్యపై ఆ దేశ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన మూడు దశాబ్దాలలో మూడింతలు అయిన మొసళ్లు ప్రమాదకరంగా ఉన్నాయని, మానవుల మరణానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మొసళ్ల ఏరివేతకు సమయం ఆసన్నమైందని, ఇందుకు చర్యలు తీసుకోవాలంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్‌ను కోరారు. అయితే, దీనిపై ఆ సంస్థ స్థానిక మేనేజర్ ల్యూక్ బెంట్లే సమయోచితంగా స్పందించారు. మొసళ్ల ఏరివేత సమీప భవిష్యత్‌లో సాధ్యమయ్యేది కాదని ప్రజలు ఆందోళనలు విరమించుకోవాలని కోరారు. ప్రజలు చేపలు పట్టే, సేదదీరే ప్రాంతాల్లో దూకుడుగా ప్రవర్తించే మొసళ్లను ఇన్నాళ్లుగా కాల్చివేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని బెంట్లే అన్నారు. ఒక్కసారిగా మొసళ్ల ఏరివేత అసాధ్యమని, ఒకవేళ ఆ ప్రాంతంలోని మొసళ్లను మట్టుబెట్టినా.. అక్కడికి వేరే ప్రాంత మొసళ్లు రావనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన అన్నారు. దీనికి బదులుగా ప్రమాదకర ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం, పర్యాటకుల భద్రత దృష్ట్యా టూరింగ్ కంపెనీలకు సూచనలు చేయడం లాంటివి చేస్తామని చెప్పారు. అయితే, దక్షిణ ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలో మొసలి ప్రమాదాలు తక్కువే. -
అమెరికన్ల పూర్వీకులు ఎవరో తెలుసా?
వాషింగ్టన్: మొన్నటిదాకా అమెరికన్లు 23000 ఏళ్ల క్రితమే సైబీరియా నుంచి వలస వచ్చారని చెప్పిన పరిశోధకుల లెక్క తప్పింది. అమెరికన్ల పూర్వీకులు సైబీరియా నుంచి కాదు.. ఆస్ట్రేలియా నుంచి వచ్చారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాలోని అమేజాన్ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు, ఆస్ట్రేలియాలో ప్రజల జన్యువులకు సారూప్యతలు ఉండటంతో శాస్త్రవేత్తలు కంగుతిన్నారు. ఇంతకాలం అమెరికన్లకు దక్షిణ ధ్రువాల నుంచి వచ్చిన ఒకే జాతి నుంచి ఉద్భవించారనుకుంటున్న శాస్త్రవేత్తల అంచనాలు తాజా పరిశోధనలతో తలకిందులయ్యాయి. మేం ముఖ్యమైన విషయాలను గుర్తించలేకపోయామని ఈ బృందానికి నేతృత్వం వహించిన డేవిడ్ రీచ్ అభిప్రాయపడ్డారు. బ్రెజిల్లో నివసిస్తున్న స్థానిక అమెరికన్లు ఆస్ట్రేలియా, న్యూగినియా, అండమాన్ నికోబార్ దీవుల్లో గిరిజనులకు జన్యుసారూప్యత ఉందని ఈ అంశంపై తాజాగా పరిశోధన చేసిన పొంటూస్ స్కోగ్లండ్ వెల్లడించారు. ఈ ఫలితాలు ఊహించలేద న్నారు. ఈ బృందం దక్షిణ మధ్య అమెరికాకు చెందిన దాదాపు 21 స్థానిక అమెరికన్ సమూహాలు, బ్రెజిల్‌లోని 9 రకాల సమూహాల నుంచి సేకరించిన జన్యుసమాచారాన్ని విశ్లేషించారు. వీటిని మరో 200 అమెరికనేతర సమూహాల జన్యువులతో పోల్చిచూడగా సరిపోలలేదు. కానీ, అమేజాన్ పరివాహంలో నివసించే సురాయి, కరిటియానా, గ్జావెంటే గిరిజన తెగల డీఎన్ఏతో ఆస్ట్రేలియాలోని గిరిజనుల డీఎన్ఏను పోల్చినపుడు సరిగ్గా సరిపోయింది. ఈ ఫలితాలతో అమెరికన్లు సైబీరియా నుంచి కాదు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఫిక్సింగ్ కు పాల్పడ్డ ఆరుగురు ఆస్ట్రేలియన్లు అరెస్ట్!
కాన్ బెర్రా: మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ఏ క్రీడను వదలి పెట్టడం లేదు. ఇప్పటి వరకూ ప్రముఖంగా క్రికెట్ లో కనిపించే ఫిక్సింగ్ మహమ్మారి ఇప్పుడు టెన్నిస్ కూడా సోకింది. ఇటీవల కాలంలో జరిగిన ఒక అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ను ఫిక్సింగ్ చేయడానికి యత్నించిన ఆరుగురు ఆస్ట్రేలియన్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది టెన్నిస్ ఆటగాళ్లను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిని మెల్ బోర్న్, విక్టోరియా పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. విక్టోరియా పట్టణంలో ముఠాగా ఏర్పడిన కొంతమంది బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఫిక్సింగ్ ముఠా రాష్ట స్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. ఇందుకు టెన్నిస్ ఆటగాళ్లనే ప్రధానంగా ఎంచుకుని ఫిక్సింగ్ చేస్తున్నారన్నారు.