
పాకిస్తాన్‌లో పాదరక్షలపై ‘ఓం’
కరాచీ: హిందువులు పవిత్రంగా భావించే ‘ఓం’ గుర్తును పాకిస్తాన్‌లో పాదరక్షలపై ముద్రించి విక్రయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది చాలా దురదృష్టకరమని, ఇలా చేయడం అపవిత్రమని అక్కడి మైనారిటీలైన హిందువులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
టాండో ఆదం ఖాన్ పట్టణంలో వీటిని విక్రయిస్తున్నారని, దీనిపై సింధ్ ప్రభుత్వం వద్ద నిరసన తెలిపామని పాకిస్తాన్ హిందూ సమాఖ్య అధినేత రమేశ్ కుమార్ చెప్పారు. వీటిని దుకాణాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమంలోనూ ఈ పాదరక్షల చిత్రాలు కనిపించాయి.