చెప్పు కొనలేని బాధ | suffering for slippers govt school children | Sakshi
Sakshi News home page

చెప్పు కొనలేని బాధ

Published Wed, Feb 3 2016 3:23 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

చెప్పు కొనలేని బాధ - Sakshi

చెప్పు కొనలేని బాధ

♦  కాళ్లకు పాదరక్షలు లేకుండానే సర్కారు బడికి..
♦  సగం మందికి పైగా విద్యార్థులు ఉట్టికాళ్లతోనే..
♦  జిల్లాలో లక్ష మందికి పైగా చెప్పులు లేని దయనీయం..
♦  పేదరిక మే కారణం.. ప్రభుత్వమే చెప్పులు ఇవ్వాలి..
♦  స్వచ్ఛంద సంస్థలూ స్పందించాలి...


 సర్కారు స్కూళ్లలో చదివేవారు అందరూ నిరుపేదలే.. పిల్లలను బడికి పంపించడం కూడా తల్లిదండ్రులకు భారమే.. తల్లిదండ్రులు భారంగా భావించకుండా ఉండటానికి బడికి వచ్చే పిల్లలకు భోజనం, దుస్తులు, చెప్పులు, పుస్తకాలు, ఇతర సామగ్రి సర్కారు సమకూరుస్తోంది.. అనేక వసతులు కూడా కల్పిస్తోంది.. ఇందులో చెప్పులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎక్కడా ఇది అమలు కాలేదు. దీంతో సగం మందికి పైగా విద్యార్థులు చెప్పులు లేకుండానే బడికి వస్తున్నారు.  ‘చెప్పు’కోలేని బాధను అనుభవిస్తున్న విద్యార్థుల కష్టాలపై
‘సాక్షి’ ఫోకస్..  - కామారెడ్డి
 
 కాళ్లకు షూస్, నడుముకు బెల్ట్, మెడలో టైతోపాటు ఐడెంటిటీ కార్డు.. ఏకరూప దుస్తులు ధరించి, బండెడు పుస్తకాలుగల బ్యాగును మోస్తూ విద్యార్థులు వెళుతుంటే.. ప్రైవేట్ పాఠశాల గుర్తుకు వస్తుంది. కాన్వెంట్ చదువుల దర్జా కనిపిస్తుంది. మరి సర్కారు బడిలో.. ప్రభుత్వం ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా అమలు సరిగా లేదు. యూనిఫామ్స్ సంగతి పాలకులెరుగు.. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని పిల్లలెందరో ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తారు. పిల్లలను బడికి పంపడమూ భారమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్న పేద తల్లిదండ్రులు.. తమ పిల్లలకు చెప్పులు కొనివ్వలేకపోతున్నారు. ‘చెప్పు’కొనలేని పేద విద్యార్థుల
 పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్...
 
 ‘‘సదాశివనగర్ మండలం కన్నాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 138 విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం 115 మంది హాజరయ్యారు. ఇందులో 80 మందికి చెప్పులు లేవు. కేవలం 35 మంది మాత్రమే పాదరక్షలు ధరించి బడికి వచ్చారు. ఇందులో మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న కన్నాపూర్ తండా నుంచి నిత్యం 35 మంది విద్యార్థులు కాలినడకన బడికి వస్తారు.’’
 
 ‘మాచారెడ్డి మండలం అక్కాపూర్ ఉన ్నత పాఠశాలలో 119 మంది
 విద్యార్థులు ఉండగా 72 మందికి మాత్రమే
 చెప్పులు ఉన్నాయి. మిగతా 47 మందికి
 చెపులు లేకుండానే బడికి వస్తున్నారు.’’

 
 ‘‘కామారెడ్డి పట్టణంలో ని ఆర్‌బీ నగర్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 71 మంది చ దువుకుంటున్నారు. మంగళవారం 55 మంది హాజరయ్యారు. ఇందులో 37 మందికి చెప్పులు లేవు. కేవలం 18 మంది మాత్రమే చెప్పులు ధరించి పాఠశాలకు వచ్చారు.’’
 
 కామారెడ్డి :  జిల్లాలో 465 ఉన్నత పాఠశాలలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,586 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో సగం మంది విద్యార్థులకు చెప్పులు లేవని తెలుస్తోంది. కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి మండలం అక్కాపూర్ ఉన్నత పాఠశాల, సదాశివనగర్ మండలం కన్నాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, కామారెడ్డి పట్టణంలోని ఆర్‌బీ నగర్ ప్రాథమిక పాఠశాలలను ‘సాక్షి’ పరిశీలించింది. ఇందులో సగం మందికిపైగా విద్యార్థులు చెప్పులు లేకుండానే బడికి వస్తున్నట్టు వెల్లడైంది.
 
 సర్కారు దృష్టి సారించాలి
 సర్కారు పాఠశాలలో ఎక్కువ మంది పేద విద్యార్థులే చదువుతున్నారన్నది కాదనలేని వాస్తవం. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు స్థోమత ఉన్నవారంతా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించి చదివిస్తున్నారు. వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేని వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. సర్కారు బడుల్లో చదివేది పేద విద్యార్థులే కాబట్టి వారికి ఏకరూప దుస్తులతో పాటు చె ప్పులను కూడా ప్రభుత్వమే అందించాల్సిన అవసరం ఉంది.
 
 స్వచ్చంద సంస్థలు స్పందించాలి...
 సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థుల చెప్పుకొనలేని బాధపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్కారు బడిలోని పిల్లలకు చెప్పులు పంపిణీ చేస్తే విద్యను ప్రోత్సహించినవారవుతారు. ‘శ్రీమంతులు’ సర్కారు బడులను దత్తత తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement