
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైల్ చైన్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ నికర లాభం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 55 శాతం జంప్‌చేసి రూ. 101 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 65 కోట్లు మాత్రమే ఆర్జించింది. మెట్రో షూస్ బ్రాండుగల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 59 శాతం దూసుకెళ్లి దాదాపు రూ. 484 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 304 కోట్ల టర్నోవర్ నమోదైంది. మొత్తం వ్యయాలు 47 శాతం పెరిగి రూ. 363 కోట్లయ్యాయి. త్రైమాసిక ప్రాతిపదికన ఇవి అత్యుత్తమ గణాంకాలని కంపెనీ సీఈవో నిస్సన్ జోసఫ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌కల్లా కంపెనీ 140 పట్టణాలలో 629 స్టోర్లను నిర్వహిస్తోంది.
వారాంతాన బీఎస్‌ఈలో మెట్రో బ్రాండ్స్ షేరు 1.5 శాతం బలపడి రూ. 508 వద్ద ముగిసింది