ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 289 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,497 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.12 శాతం మెరుగుపడి 1.58 శాతానికి చేరాయి. గత క్యూ3లో 2.7 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.9 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. వృద్ధి, లాభదాయకత, రుణాల నాణ్యత తదితర అంశాలలో మరోసారి నిలకడైన, పటిష్ట పనితీరును ప్రదర్శించగలిగినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో బి.రమేష్ బాబు పేర్కొన్నారు.
ఫలితాల నేపథ్యంలో శనివారం కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 0.3 శాతం బలపడి రూ. 170 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment