![Life insurer net profit surges to Rs 6,334 crore - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/10/LIC12.jpg.webp?itok=KpjMBza6)
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. నికర లాభం అత్యంత భారీగా దూసుకెళ్లి రూ. 8,334 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 235 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 97,620 కోట్ల నుంచి రూ. 1,11,788 కోట్లకు జంప్ చేసింది. అయితే గత కాలంలో కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానందున ఫలితాలు పోల్చి చూడటం తగదని ఎల్‌ఐసీ పేర్కొంది. కాగా.. పెట్టుబడుల ఆదాయం రూ. 76,574 కోట్ల నుంచి రూ. 84,889 కోట్లకు ఎగసింది.
అదానీ గ్రూప్‌పై..
క్యూ3లో వాటాదారుల నిధికి రూ. 2,000 కోట్లను ప్రొవిజన్లకింద బదిలీ చేయడంతో నికర లాభం రూ. 6,334 కోట్లుగా నమోదైనట్లు ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. అదానీ గ్రూ ప్ యాజమాన్యంతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా అదానీ గ్రూప్ కంపెనీలలో తలెత్తిన సంక్షోభంపై ఇన్వెస్టర్ బృందం ద్వారా వివరణను కోరనున్నట్లు తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.5% పుంజుకుని రూ. 614 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment