Netizens Praising Alia Bhatt For Picked Paparazzi Lost Slippers With Her Hand, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Alia Bhatt Picked Slippers With Hands: వావ్.. ఆలియా భట్.. వాట్‌ ఏ సింప్లీసిటీ!

Published Sat, Jul 15 2023 1:34 PM | Last Updated on Sat, Jul 15 2023 1:45 PM

Alia Bhatt Gives Someone Foot WearTo Bring with Hand Goes Viral - Sakshi

బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరైంది. ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తోంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే రణ్‌బీర్‌సింగ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ గతేడాది నవంబర్‌లో ఓ పాపకు జన్మనిచ్చింది. తన ముద్దుల కూతురికి రాహా అని నామకరణం కూడా చేసింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆలియా భట్‌ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: స్లిమ్‌ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!)

 ఓ ఈవెంట్‌కు హాజరైన ఆలియా భట్ తిరిగి వెళ్తుండగా కారు వద్ద ఆమెకు ఓ వ్యక్తి చెప్పు కనిపించింది. అయితే కారు వద్దకు వెళ్తున్న ఆలియా భట్ ఎవరిదని ఆరా తీసింది. అంతే కాకుండా స్వయంగా తానే చేతితో పట్టుకుని అతనికి అందించింది. ఇది చూసిన నెటిజన్స్ ఆలియా సింప్లిసిటీ మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తి పాదరక్షలను చేతితో పట్టుకుని ఇవ్వడం గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరలవుతోంది.  కాగా ఆలియా భట్ నటిస్తోన్న 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement