cheppals
-
స్టార్ హీరోయిన్.. అయినా కూడా చెప్పులు మోసింది!
బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరైంది. ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తోంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే రణ్‌బీర్‌సింగ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ గతేడాది నవంబర్‌లో ఓ పాపకు జన్మనిచ్చింది. తన ముద్దుల కూతురికి రాహా అని నామకరణం కూడా చేసింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆలియా భట్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!) ఓ ఈవెంట్‌కు హాజరైన ఆలియా భట్ తిరిగి వెళ్తుండగా కారు వద్ద ఆమెకు ఓ వ్యక్తి చెప్పు కనిపించింది. అయితే కారు వద్దకు వెళ్తున్న ఆలియా భట్ ఎవరిదని ఆరా తీసింది. అంతే కాకుండా స్వయంగా తానే చేతితో పట్టుకుని అతనికి అందించింది. ఇది చూసిన నెటిజన్స్ ఆలియా సింప్లిసిటీ మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తి పాదరక్షలను చేతితో పట్టుకుని ఇవ్వడం గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా ఆలియా భట్ నటిస్తోన్న 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!) Alia Respect 🙌🏻 Might have seen a few celebs lifting their own footwears but Never seen someone lifting a pap's sleeper lying roadside & people troll her for her attitude#AliaBhatt pic.twitter.com/cNV6e4vTqA — Nikki Tamboli Fam 💅🏻 (@FamNikki) July 13, 2023 -
అందుకే ప్రమోషన్స్‌కి చెప్పులేసుకొని వెళ్తున్నా: విజయ్ దేవరకొండ
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ దూకుడు పెంచింది. అయితే ట్రైలర్ రిలీజ్ నుంచి ఇప్పటివరకు ప్రతీచోటవిజయ్ చెప్పులు(స్లిప్పర్స్)ధరిస్తూ తన సింప్లిసిటీ చూపిస్తున్నాడు. మరికొంతమంది మాత్రం అటెన్షన్ కోసమే విజయ్ ఇలా చేస్తున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై విజయ్ క్లారిటీ ఇచ్చాడు. 'నాకు ఆ టైమ్‌లో ఏది నచ్చితే అదే ధరిస్తాను. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్నిరకాల వస్తువులను ఇష్టపడతాను. అంతేకాకుండా సినిమా రిలీజ్‌కి ఎక్కువ టైం కూడా లేదు. ప్రతిరోజూ ఒక డ్రెస్, దానికి నప్పే షూల కోసం వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ చెప్పులు కొనుగోలు చేశా. దీనివల్ల నా డ్రెస్సింగ్‌కి ఎక్కువ సమయం పట్టడం లేదు. అయినా ప్రమోషన్స్‌కి ఇలా చెప్పులేసుకొని వెళ్లడం వల్ల ఎవరేమనుకుంటారో అని పట్టించుకోను. నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా' అంటూ విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
సిరిసిల్ల జిల్లాలో అమానుషం!
సాక్షి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ అటెండర్ కనకయ్యతో చెప్పులు తుడిపించారు. ఈ ఘటన తంగళపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తుతున్నాయి. డీఎమ్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై డీఎమ్హెచ్వో చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ‘చెప్పులపై క్యాండిల్ మరకలు పడటంతో నేను తొలగిస్తుంటే.. అటెండర్ మధ్యలో కల్పించుకున్నాడు. చెప్పులను తీసుకుని వెళ్లాడు. నేను వారించిన కూడా అతడు వినలేదు. నా చెప్పులు తుడిపించే స్థాయికి దిగజారలేదు. ఆ ఫొటో ఎవరు తీశారో కూడా నాకు తీయలేదు. ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకుంటాను’ అని చంద్రశేఖర్ తెలిపారు. -
అటెండర్‌తో చెప్పులు తుడిపించిన డీఎంహెచ్‌వో!
-
కొల్హాపురి చెప్పులకు అరుదైన ఘనత
ముంబై : సాంప్రదాయ పాదరక్షలు అనగానే గుర్తొచ్చేది కొల్హాపురి చెప్పులు. దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ కలిగిన కొల్హాపురి బ్రాండ్‌కు తాజాగా జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించింది. జీఐ ట్యాగ్ లభించడం ద్వారా కొల్హాపురి చెప్పుల మార్కెట్ మరింతగా పెరగనుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, సంగ్లీ, సతారా, కర్ణాటకలోని ధార్వాడ్, బెల్గామ్, బగల్కోట్, బీజాపూర్ జిల్లాలను కొల్హాపురి చెప్పుల మూల స్థానంగా పేర్కొన్నారు. నిర్ధిష్ట భూగోళ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వాటికి ఈ జీఐ ట్యాగ్‌ని అందజేస్తారు. ఇది మరో చోట ఉత్పత్తి కాదని అర్థం. ఈ ట్యాగ్ క్వాలిటీని కూడా సూచిస్తుంది. ఈ జియో ట్యాగ్ వల్ల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో గుర్తింపు లభిస్తోంది. -
ఇంత కుప్పలో నాకు నప్పే చెప్పులెక్కడ?
రాజమండ్రి: గోదావరి పుష్కరాల 12 రోజులూ కోట్లమంది స్నానమాచరించి, ఆ పుణ్యఫలం దక్కిందన్న తృప్తితో తిరిగి వెళ్లారు. పుష్కరాలు ముగిసి అయిదు రోజులైనా రాజమండ్రిలోని ఘాట్ల వద్ద ఇప్పటికీ అనేకులు నదిలో మునిగి తేలుతూనే ఉన్నారు. వారి లక్ష్యం పుణ్యఫలం మాత్రం కాదు..స్నానాల సందర్భంగా భక్తులు గోదారమ్మకు సమర్పించిన నాణేలు, వెండి, బంగారు ప్రతిమల వేట. అందుకోసం అయిస్కాంతాలు, చేటలు, ఇతర సాధనాలతో రేవుల్లో దేవుతూనే ఉన్నారు. మరికొందరు బడుగు జీవులు మాత్రం పుష్కర రద్దీలో భక్తలు విడిచిన వేలాది చెప్పుల్లో తమకు సరిపోయే 'జోడు' కోసం వెతుక్కుంటున్నారు. వీఐపీ ఘాట్, గౌతమి ఘాట్ల వద్ద భక్తులు విడిచి వెళ్లిన చెప్పులను పారిశుద్ధ్య సిబ్బంది ...ఇస్కాన్ ప్రాంతంలో గుట్టగా వేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆ గుట్టను గాలించిన ఓ బాలుడు చివరకి అనుకున్నది సాధించాడు. కొందరికి ఎంతసేపు వెతికినా నిరాశే మిగులుతోంది. -
'చెప్పు'కోలేని పనులు..!
(వెబ్సైట్ ప్రత్యేకం) అధికారం ఉంటే చాలు! నాయకులు అవతార పురుషులవుతారు. వీరికి తమవాళ్లు తప్ప.. బహుశా మిగతావారు మనుషులుగా కనిపించరనుకుంటా.. ఎంతైతే అంత... ఏపనైతే ఆపని.. చెప్పేముందు వాళ్లు తమలాంటి మనుషులేనని, మనోభావాలతోపాటు, వారికీ ఆత్మ గౌరవం ఉంటుందని గుర్తులేక ఇలా చేస్తారో... గుర్తుంచుకొనే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారో వారి చర్యలు చూస్తే ఇట్టే బోధపడుతుంది. అడిగేవాడు లేకపోవాలేగానీ ముక్కున వేలేసుకుని ఫక్కున నవ్వే పనులు ఏవైనా చేయించుకోగల సమర్థులు వీరు. అందుకే కొందరు తమ వెంట ఉండే అధికారులకు సంబంధించిన బాధ్యతలు ఇస్తుంటే ఇంకొందరు నాయకులేమో స్వయంపాలన(సొంతసేవ)కు ఉపయోగించుకుంటున్నారు. ఈమధ్యకాలంలో నాయకుల వెంట ఉండే కొందరు అధికారుల పరిస్థితి దీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే మన అమాత్యులు... వారితో తమ చెప్పులు,బూట్లు మోయించుకుంటున్నారు... తుడిపించుకుంటున్నారు.. .. తొడిగించుకుంటున్నారు. ఇది వారి అధికారం, ఆధిపత్యం, అహంకారాన్ని స్పష్టం చేస్తోంది. ఒకవేళ అధికారంలో లేకున్నా ఆ వాసనలు మాత్రం వారిని వదిలిపెట్టవనేది వాస్తవం. అందివచ్చినంతవరకూ 'సేవ'లలో తరించటం పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ విమర్శలు వెల్లువెత్తినా నవ్విపోదురూ గాక నాకేంటి సిగ్గన్నట్లు దులుపుకోవటం చూస్తూనే ఉన్నాం. అనుచరులనే కాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ పొలిటికల్ లీడర్లు వదలడం లేదు. తాజాగా ఓ మంత్రివర్యుడు ఏకంగా ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో షూ లేస్‌లు కట్టించుకుంటూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. మమతాబెనర్జీ ప్రభుత్వంలో ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రిగా పని చేస్తున్న రచ్‌పాల్ సింగ్ తన వ్యక్తిగత భద్రతకు నియమించిన గార్డుతో బూటు లేసులు కట్టించుకుంటూ విమర్శల పాలయ్యారు. ఇక మన రాష్ట్రానికి వస్తే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు...రాయల్ ఠీవీ చెప్పనవసరం లేదు. బహిరంగంగానే ఆయన తన అనుచరుల సేవలను ఆస్వాదిస్తుంటారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన తన వ్యక్తిగత సహాయకుడితో కాళ్లకు చెప్పులు తొడిగించుకున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీనే బాహాటంగా ఇలా వ్యవహరించటం చూసినవాళ్లు ముక్కున వేలేసుకున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రులుగా పని చేసిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మూడు ఆకులు ఎక్కువే చదివారు. సీఎం పదవి వెలగబెట్టిన సమయంలో మాయావతి బూట్లు మురికిగా ఉన్నాయని రక్షణగా వచ్చిన ఓ ఐఏఎస్ అధికారి ఆమె బూట్లు శుభ్రం చేసిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ గారు ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యే అన్వర్ అహ్మద్ చేత బూట్లు తొడిగించుకున్నారు. అది కాస్తా వివాదం కావటంతో ఆయన గారు ఛాఛా...నేను బూట్లు తొడిగించుకోవటం ఏంటీ.., బూటు తాడును మాత్రమే ఎమ్మెల్యే ముడివేశారని వివరణతో ఆ వివాదాన్నికి తెరపెట్టేశారు. కింది స్థాయి ఉద్యోగుల చేత చెప్పులు , బూట్లూ మోయించుకుని కాళ్ళకు తొడిగించుకుంటున్నారంటే సమాజం ఎటు పోతోందని చూసిన ... అయితే అక్కడే మీడియా సిబ్బంది ఉండడంతో మంత్రి గారి అనుచరులు బూట్లను దూరంగా పడేశారు. అంతటితో ఊరుకున్నారా... గడ్డి స్కామ్‌లో జైలుకు వెళ్లివచ్చినా... తన దర్పాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. ఓ పోలీసుతో చెప్పులు మోయించి, మరో డీఎస్పీ స్థాయి అధికారితో ఏకంగా కాళ్లు కడిగించుకుని అప్పట్లో పతాక శీర్షికలకెక్కిన విషయం తెలిసిందే. భజనపరులతో భుజ కీర్తులు తొడిగించుకున్న నేతలు తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో పాదసేవల్లో తరించిపోతున్నారు. చెబితే చాంతండంత అన్నట్లుగా ఇలాంటి సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే..