Vijay Devarakonda Reveals Reason Behind Wearing Chappals For Liger Promotions - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda : స్లిప్పర్స్‌తోనే ప్రమోషన్స్‌.. కారణం ఏంటో చెప్పిన విజయ్‌

Published Wed, Aug 10 2022 3:28 PM | Last Updated on Wed, Aug 10 2022 4:20 PM

Vijay Devarakonda Reveals Reason Behind Wearing Chappals For Liger Promotions - Sakshi

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'లైగర్‌'. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్‌ దూకుడు పెంచింది. అయితే ట్రైలర్‌ రిలీజ్‌ నుంచి ఇప్పటివరకు ప్రతీచోటవిజయ్‌ చెప్పులు(స్లిప్పర్స్‌)ధరిస్తూ తన సింప్లిసిటీ చూపిస్తున్నాడు. మరికొంతమంది మాత్రం అటెన్షన్‌ కోసమే విజయ్‌ ఇలా చేస్తున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై విజయ్‌ క్లారిటీ ఇచ్చాడు. 'నాకు ఆ టైమ్‌లో ఏది నచ్చితే అదే ధరిస్తాను. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్నిరకాల వస్తువులను ఇష్టపడతాను. అంతేకాకుండా సినిమా రిలీజ్‌కి ఎక్కువ టైం కూడా లేదు. ప్రతిరోజూ ఒక డ్రెస్‌, దానికి నప్పే షూల కోసం వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ చెప్పులు కొనుగోలు చేశా.

దీనివల్ల నా డ్రెస్సింగ్‌కి ఎక్కువ సమయం పట్టడం లేదు. అయినా ప్రమోషన్స్‌కి ఇలా చెప్పులేసుకొని వెళ్లడం వల్ల ఎవరేమనుకుంటారో అని పట్టించుకోను. నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా' అంటూ విజయ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్‌ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement