Vijay Devarakonda Liger Movie OTT Release Date, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Liger Movie Ott Release Date: భారీ ధరకు 'లైగర్‌' డిజిటల్‌ హక్కులు!.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Published Sat, Aug 27 2022 12:41 PM | Last Updated on Sat, Aug 27 2022 2:48 PM

Vijay Devarakonda Liger Movie Ott Release Date And Ott Platform - Sakshi

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్'. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను రీచ్‌ కాలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.సినిమా రిలీజ్‌కు ముందే ఈ డీల్‌ కుదుర్చుకుంది.సాధారణంగా కొత్త సినిమాలు 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. దీన్ని బట్టి అక్టోబర్‌ తొలివారంలో లైగర్‌ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి:  లైగర్‌ రిజల్ట్‌ తర్వాత విజయ్‌ ఏం చేశాడో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement