Liger Movie Streaming on Disney Plus Hotstar, Where Is Date And Time - Sakshi
Sakshi News home page

Liger OTT Streaming: ఫ్లాప్‌ ఎఫెక్ట్‌.. అప్పుడే ఓటీటీకి లైగర్‌, ఆ రోజు నుంచి అక్కడ స్ట్రీమింగ్‌!

Published Tue, Sep 20 2022 4:43 PM | Last Updated on Tue, Sep 20 2022 8:18 PM

Liger Movie Streaming on Disney Plus Hotstar, Where Is Date And Time - Sakshi

విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'లైగర్‌'. భారీ అంచనాల మధ్య ఆగస్ట్‌ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్‌ నిలుస్తుందనుకు మూవీ టీం అంచనాలను తలకిందులు చేసింది. ఫలితంగా ఈ చిత్రం ఘోరపరాజయం పొందింది. మైక్‌ టైసన్‌ వంటి ప్రపంచ చాంపియన్‌ ఉన్నా కంటెంట్‌ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్‌ మరోసారి నిరూపించింది.

చదవండి: నా పాటంటేనా? నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా?: సునీత

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే ఏ చిత్రమైన థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అలాగే లైగర్‌ కూడా ఓటీటీలోకి రాబోతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించి ఉంటే ఓటీటీకి వచ్చేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలలు పట్టేది. ఇటీవల వచ్చిన చిన్న సినిమా రేంజ్‌ను కూడా ఈ మూవీ దాటలేకపోయింది. దీంతో అనుకున్న సమయాని కంటే ముందే లైగర్‌ ఓటీటీలోకి వచ్చేస్తుంది.

చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్‌ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ

కాగా లైగర్‌ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 22 నుంచి లైగర్‌ను స్ట్రీమింగ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్‌-పూరీ కనెక్ట్స్‌పై బాలీవుడ్‌ నిర్మాత కరన్‌ జోహార్‌-చార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సీనియర్‌ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ అతిథి పాత్రలో కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement