రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లైగర్ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఇంతలోనే బాయ్‌కాట్ లైగర్ అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోపక్క సినిమా ప్రమోషన్స్ కోసం దేశాన్ని చుట్టేస్తున్నారు విజయ్, అనన్యపాండే. ఇదిలా ఉంటే సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలని భారీ ఆఫర్లు వచ్చాయట. కానీ కథ మీదున్న నమ్మకంతో వాటన్నింటినీ తిరస్కరించారట.
మొదట థియేటర్‌లోనే రిలీజ్ చేస్తామని ముక్తకంఠంతో చెప్పారట. మరి ఈ సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీలోకి రానుందనే విషయాన్ని తాజాగా లైగర్ విలన్ విషు రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'లైగర్ థియేటర్‌లో చూడాల్సిన చిత్రం. ఇది ఓటీటీకి పెద్దగా సెట్టవ్వదు. ఇప్పుడప్పుడే ఓటీటీలోకి కూడా రాదు. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది' అని క్లారిటీ ఇచ్చాడు విషు.
చదవండి: విజయ్ 'లైగర్'కు బాయ్‌కాట్ సెగ.. ట్విట్టర్‌లో ట్రెండింగ్
కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ కౌంటర్, వేడి కాఫీలో ముంచేస్తారు
Comments
Please login to add a commentAdd a comment