భారత ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ కార్ల హవా కొనసాగుతోంది. టాప్ బ్రాండ్ల ప్రీమియం కార్లకు లగ్జరీతో పాటు అదిరిపోయే ఫీచర్లు ఉంటే చాలు, ఆ కార్ల డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సీరిస్ నుంచి మరో కొత్త కారును ఇండియన్ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. సెడాన్ ఫ్లాగ్‌షిప్ ఆడి ఏ8 ఎల్ (Audi A8 L)ను తాజాగా విడుదల చేసింది.
కారు లాంచింగ్ సందర్బంగా ఆ సంస్థ ఇండియన్ హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ఆడి ఏ8 ఎల్ మోడల్ కస్టమర్లని మరింత ఆకట్టుకునేలా, బెస్ట్ టెక్నాలజీతో పాటు కస్టమర్ల సౌకర్యంలో ఏ మాత్రం రాజీపడకుండా ఉండే ఫీచర్లతో తయారుచేసినట్లు తెలిపారు. ఇండియాలో ఆడి A8L కారు.. ఆడి A8 L సెలబ్రేషన్ ఎడిషన్, (ధర రూ.1.29 కోట్లు), ఆడి A8 L టెక్నాలజీ (ధర రూ. 1.57 కోట్లు) రెండు వేరియంట్లో డిజైన్ చేసినట్లు చెప్పారు. ఆడి A8 L సెలబ్రేషన్ ఎడిషన్ 5- సీటర్‌గా అందుబాటులో ఉండగా, ఆడి A8 L టెక్నాలజీ వేరియంట్ మాత్రం 4, 5-సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ప్రత్యేకతలను ఓ లుక్కేద్దాం.
కలర్ ఆప్షన్స్
ఈ సెడాన్ ఎనిమిది స్టాండర్ట్ ఎక్స్‌టీరియర్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ కొత్త ఆడి కారును టెర్రా గ్రే, ఫిర్మామెంట్ బ్లూ, డిస్ట్రిక్ట్ గ్రీన్, ఫ్లోరెట్ సిల్వర్, గ్లేసియర్ వైట్, మాన్‌హట్టన్ గ్రే, వెసువియస్ గ్రే, మైథోస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇంటీరియర్ విషయానికొస్తే.. మదర్ ఆఫ్ పెర్ల్ బీజ్, కాగ్నాక్ బ్రౌన్, సార్డ్ బ్రౌన్, బ్లాక్ వంటి నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఇంజిన్ కెపాసిటీ
డైనమిక్ 3.0L టర్బో చార్జ్ TFSI (పెట్రోల్), 48V మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఫీచర్స్ ఉన్న ఈ కారు.. 340 hp పవర్‌ను, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా కేవలం 5.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. కారులోని సస్పేన్షన్ ఫీచర్ ఏర్పాటు చేయడంతో ఇది కస్టమర్లకు సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని కలిగిస్తుంది.
సేఫ్టీ సూట్..
కారులో మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్(ఫ్రంట్ అండ్ రియర్ సీట్లుతో పాటు సైడ్ బ్యాగ్స్‌తో కలిపి) ఉన్నాయి. కారుకు ఏదైనా ప్రమాదం జరిగిన కేవలం మిల్లీసెకన్ల సమయంలోనే ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చేలా అమర్చారు.
చదవండి: Bajaj Pulsar Price Hike.. ఆ బైక్ మోడళ్ల ధరలు పెంచిన బజాజ్.. ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment