
సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు
పుణే : క్షణాల్లో లక్షలు విలువ చేసే కారు బుగ్గిపాలైంది. పార్కింగ్‌లో ఉన్న ఆడీ కారును తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పుణేలోని ధాయారి ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుపై ఏదో విసిరారు. ఆపై నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. క్షణాల్లోనే కారు బుగ్గి పాలైపోయింది. అయితే ఈ ఘటనలో పక్కనే ఉన్న మారుతీ సుజుకీ, హోండా సిటీ కారులు కూడా దహనం అయ్యాయి. కారు యాజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బేస్‌మెంట్‌లోని సీసీ టీవీ ఫుటేజీలో ఆ దృశ్యాలు నమోదు అయ్యాయి. ఆడీ క్యూ-5 మోడల్‌కు చెందిన ఆ కారు ఖరీదు రూ. 50లక్షలు పైగానే తేలింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.