విరాట్‌ కోహ్లి తొలి ఆడికారు.. పోలీస్‌ స్టేషన్‌లో | Kohlis First Audi R8 Car Seen Lying In The Police Station | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి తొలి ఆడికారు.. పోలీస్‌ స్టేషన్‌లో

Dec 14 2020 10:43 AM | Updated on Dec 14 2020 3:32 PM

Kohlis First Audi R8 Car Seen Lying In The Police Station - Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లను వాడేశాడు. స్పోర్ట్స్‌ పర్సన్‌గా, అందులోనూ లీడింగ్‌ క్రికెటర్‌గా ఉన్న కోహ్లి.. లగ్జరీ కార్లను వాడటం పెద్ద విషయం కాకపోవచ్చు. ఇప్పటికే ఇలా ఎన్నో లగ్జరీ కార్లు కోహ్లి ఖాతాలోకి వచ్చి.. పోయాయి కూడా. కాగా, అలా కోహ్లి ఖాతాలోకి వచ్చిన ఒక కారు చాలాకాలంగా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంది.  అది కూడా కోహ్లి వాడిన తొలి ఆడి కారు కావడం గమనార్హం​.  అసలు విషయం ఏమిటంటే..  ఎప్పుట్నుంచో ఆడి ఇండియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కోహ్లికి  ‘ఆడి ఆర్‌8 వీ10 కానుకగా వచ్చింది. దాన్ని  2016లో ఒక బ్రోకర్‌ ద్వారా సాగర్‌ థక్కర్‌ అనే వ్యక్తికి  అమ్మేశాడు.  అది కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌ ఇవ్వడం కోసం సాగర్‌ థక్కర్‌.. కోహ్లి వద్ద ఆడి కారును కొనుగోలు చేశాడు.  ఇంతవరకూ బాగానే ఉన్నా అతనికి నేర చరిత్ర ఉంది.  (అంపైర్‌ చీటింగ్‌.. అసలు అది ఔట్‌ కాదు)

ఒక స్కామ్‌లో భారీగా మోసం చేసి పోలీసులకు పట్టుబట్టాడు. దాదాపు రూ. 12 కోట్ల వరకూ స్కామ్‌ చేసి దొరికిపోయాడు. దాంతో అతన్ని అరెస్టు చేసిన ముంబై పోలీసులు, ఆడి కారును కూడా సీజ్‌ చేశారు. దాంతో ఆ కారు అప్పట‍్నుంచి థానే పోలీస్‌ స్టేషన్‌లోనే పడి ఉంది. ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ము పట్టేసి ఉన్న కారును ఆటోమొబైల్‌ రంగం నిపుణుడొకరు తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  ‘ కోహ్లి వాడిన ‘ఆడి ఆర్‌8 వీ10 కారు’ పోలీస్‌ గ్రౌండ్‌లోనే ఉంది. ఒకరు వద్ద నుంచి మరొకరి వద్దకు వచ్చి ఇలా పోలీస్‌ స్టేషన్‌లో మగ్గుతుంది. దాదాపు ఏడాది కాలంగా కారు ఇక్కడే చూస్తున్నా. ఇప్పుడు ఆ కారు ఖరీదు ఎంత ఉంటుందో కూడా తెలీదు’ అని పేర్కొన్నారు. ఇలా కోహ్లి వాడిన తొలి ఆడి కారు పోలీస్‌ స్టేషన్‌లో ఉండటం ఫ్యాన్స్‌కు కాస్త బాధ కల్గించే అంశమే. ఒకవేళ ఈ  విషయం కోహ్లి వరకూ చేరితే దాని కోసం ఏమైనా చేస్తాడేమో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement