స్కాం చేసి కొన్న కారు కోహ్లీదే!
స్కాం చేసి కొన్న కారు కోహ్లీదే!
Published Sat, Oct 29 2016 12:01 PM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM
న్యూఢిల్లీ : కాల్ సెంటర్ స్కాంతో అమెరికన్ వాసుల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సాగర్ థక్కర్ అలియాస్ షాగీ, రూ.2.5 కోట్ల ఆడీ ఆర్8 కారును ఎవరి వద్ద నుంచి కొన్నాడో తెలుసా? భారత టెస్ట్ క్రికెట్కు సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లి నుంచి ఈ కారును కొనుగోలు చేసినట్టు తెలిసింది. అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన ఈ కారును హర్యానాలో దాచిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.
ఆ కారును గురువారం అహ్మదాబాద్లో థానే పోలీసులు సీజ్ చేశారు. గత మేలో కోహ్లీ నుంచి థక్కర్ ఈ కారును కొనుగోలు చేశారని, అయితే సాగర్ పాల్పడుతున్న ఈ స్కాం గురించి కోహ్లీకి తెలియక అతనికి విక్రయించాడని థానే పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ తెలిపారు. కాల్ స్కాంలో కొల్లగొట్టిన డబ్బుతోనే ఈ ఆడీ ఆర్8 కారును కొనుగోలుచేశాడని పేర్కొన్నారు.
విచారణ ప్రక్రియలో భాగంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు చెప్పారు. షాగికి హైఎండ్ కార్లంటే చాలా ఇష్టమని, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం విరాట్ కోహ్లీ నుంచి ఈ కారును కొన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అక్టోబర్4న ఈ స్కాం బయటపడింది.
ముంబైలోని మిరా రోడ్లో ఏడంతుల భవనంలో కొంతకాలంగా కాల్ సెంటర్లు నడపుతూ విదేశీయులకు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లమంటూ ఫోన్లు చేస్తూ వారి నుంచి వందల కోట్ల రూపాయలను దోచేసిన సంగతి తెలిసిందే. మొత్తం 6వేల మంది అమెరికన్లు తమ సంపాదనను భారీగా కోల్పోయారు. ఈ స్కాం ప్రధాన సూత్రధారి శగ్గిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్(ఎఫ్బీఐ) కూడా ఈ స్కాంపై విచారణ చేపడుతోంది.(చదవండి.... స్కాం చేసి.. గర్ల్‌ఫ్రెండుకు 2.5 కోట్ల కారు గిఫ్ట్)
Advertisement
Advertisement