Sagar Thakkar
-
కోహ్లీ దగ్గర కారును కొని గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చి..
ముంబయి: గర్ల్‌ఫ్రెండ్‌కు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆడి కారు బహుమతిగా ఇచ్చిన ఓ వ్యక్తిని థానే పోలీసులు భారీ కుంభకోణం కేసులో అరెస్టు చేశారు. అతడు గిఫ్ట్‌గా ఇచ్చిన కారును స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం ముంబయిలో మకాం ఉంటున్న అతడిని కోట్ల విలువ చేసే కుంభకోణానికి పాల్పడినందుకు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సాగర్ థక్కర్ అనే వ్యక్తి అలియాస్ షాగీ కలకలం సృష్టించిన కాల్ సెంటర్ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు. ఇతడు పాల్పడిన కుంభకోణంలో బాధ్యులైన వారు ఎక్కువగా దక్షిణాసియా వాసులే ఉన్నారు. అది కూడా అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా వారినే ఎక్కువగా మోసం చేశాడు. అమెరికా అధికారుల సమాచారం మేరకు 300మిలియన్ల డాలర్లను కొల్లగొట్టాడు. 2013నుంచి అతడు ఈ కుంభకోణానికి తెరతీయగా థానేలోని మిరా రోడ్డులో గత ఏడాది(2016) అక్టోబర్ 4న పోలీసులు నిర్వహించిన దాడులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు రెండు రోజుల్లోనే దేశం విడిచి వెళ్లిపోయాడు. ఇటీవలె దుబాయ్ అతడిని దేశం నుంచి బహిష్కరించడంతో తాజాగా అతడిని పోలీసులు ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. థక్కర్ ముంబయిలో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇతడికి పెద్ద మొత్తంలో ప్రైవేటు సైన్యం కూడా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం ఇటీవల ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి ఆడి ఆర్8కారు రూ.2.5కోట్లకు కొనుగోలు చేసి తన ప్రేయసికి బహుమతిగా ఇచ్చాడు. అయితే, కారు అమ్మిన కోహ్లీకి అతడు మోసగాడని తెలియదని, ఆయన అమాయకుడని థానే పోలీసు చీఫ్ తెలిపారు. -
స్కాం చేసి గర్ల్‌ఫ్రెండ్‌కు ఆడికారు: షాగీ అరెస్టు!!
అమెరికాలోని పన్ను ఎగవేతదారుల నుంచి రూ. 500 కోట్లు (300 మిలియన్ డాలర్లు) కొల్లగొట్టిన మహారాష్ట్ర థానె యువకుడు సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాది ఈ స్కాం వెలుగుచూసిన నాటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షాగీని శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో తలదాచుకున్న అతన్ని జాడ గుర్తించి..డిపోర్టేషన్ ముంబై ఎయిర్‌పోర్టుకు తరలించగా.. అక్కడికి వచ్చిన వెంటనే థానె కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని థానె తరలించి విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. 2013లో థానెకు చెందిన కనీసం డజను కాల్ సెంటర్లు.. అమెరికాలోని 15వేలమంది పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకొని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కాల్ సెంటర్ కుంభకోణానికి తెరలేపాయి. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన డబ్బులో రూ. రెండుకోట్లు పెట్టి షాగీ తన గర్ల్‌ఫ్రెండుకు ఆడి కారును బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చాడు. అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలుచేయడం అప్పట్లో కలకలం రేపింది. థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. -
కాల్ సెంటర్ స్కామ్: మాస్టర్ మైండ్ జాడ తెలిసింది!
దుబాయి: మహారాష్ట్రలోని థానెలో ఉండి అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి దాదాపు రూ.500 కోట్లు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ వివరాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అతడు ప్రస్తుతం దుబాయిలో ఉన్నట్లు థానె అధికారులు వెల్లడించారు. కాల్ సెంటర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. గతేడాది తన గర్ల్‌ఫ్రెండుకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆడి కారును బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చిన విషయాన్ని గతంలోనే తెలిపారు. దుబాయి పోలీసులు ఠక్కర్‌ను గుర్తించి అడ్డుకున్నారని థానే పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడినా.. పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. గత నెలలో సాగర్ ఠక్కర్ యూఏఈకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా దుబాయి విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పుణే పోలీసులకు స్థానిక సిబ్బంది సమాచారం అందించారు. అయితే అతడిపై రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వ్యవహారం తేలిన తర్వాతే విదేశాలకు అనుమతిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దుబాయి అధికారులు వారి ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత తమ కస్డడీకి ఠక్కర్‌ను అప్పగించాలని కోరనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. కాల్ సెంటర్ స్కామ్‌కు సంబంధించి గత అక్టోబర్‌లో 9 బోగస్ కాల్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు దాదాపు 70 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలుచేయడం అప్పట్లో కలకలం రేపింది. థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. -
స్కాం చేసి కొన్న కారు కోహ్లీదే!
న్యూఢిల్లీ : కాల్ సెంటర్ స్కాంతో అమెరికన్ వాసుల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సాగర్ థక్కర్ అలియాస్ షాగీ, రూ.2.5 కోట్ల ఆడీ ఆర్8 కారును ఎవరి వద్ద నుంచి కొన్నాడో తెలుసా? భారత టెస్ట్ క్రికెట్‌కు సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లి నుంచి ఈ కారును కొనుగోలు చేసినట్టు తెలిసింది. అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన ఈ కారును హర్యానాలో దాచిపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ కారును గురువారం అహ్మదాబాద్‌లో థానే పోలీసులు సీజ్ చేశారు. గత మేలో కోహ్లీ నుంచి థక్కర్ ఈ కారును కొనుగోలు చేశారని, అయితే సాగర్ పాల్పడుతున్న ఈ స్కాం గురించి కోహ్లీకి తెలియక అతనికి విక్రయించాడని థానే పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ తెలిపారు. కాల్ స్కాంలో కొల్లగొట్టిన డబ్బుతోనే ఈ ఆడీ ఆర్8 కారును కొనుగోలుచేశాడని పేర్కొన్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు చెప్పారు. షాగికి హైఎండ్ కార్లంటే చాలా ఇష్టమని, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం విరాట్ కోహ్లీ నుంచి ఈ కారును కొన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అక్టోబర్4న ఈ స్కాం బయటపడింది. ముంబైలోని మిరా రోడ్లో ఏడంతుల భవనంలో కొంతకాలంగా కాల్ సెంటర్లు నడపుతూ విదేశీయులకు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లమంటూ ఫోన్లు చేస్తూ వారి నుంచి వందల కోట్ల రూపాయలను దోచేసిన సంగతి తెలిసిందే. మొత్తం 6వేల మంది అమెరికన్లు తమ సంపాదనను భారీగా కోల్పోయారు. ఈ స్కాం ప్రధాన సూత్రధారి శగ్గిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్(ఎఫ్‌బీఐ) కూడా ఈ స్కాంపై విచారణ చేపడుతోంది.(చదవండి.... స్కాం చేసి.. గర్ల్‌ఫ్రెండుకు 2.5 కోట్ల కారు గిఫ్ట్) -
ఆ 61మందిలో ఎక్కువమంది భారతీయులే...
-
ఆ 61మందిలో ఎక్కువమంది భారతీయులే...
వాషింగ్టన్ : అహ్మదాబాద్ కేంద్రంగా సాగిన వందల కోట్ల కాల్ సెంటర్ కుంభకోణంలో 61మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా న్యాయశాఖ గురువారం అభియోగాలు నమోదు చేసింది. వీరిలో ఎక్కువమంది భారతీయులే. ఈ కేసుకు సంబంధించి అమెరికాలో 20మందిని నిన్న అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిని ఇమిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా అమెరికా న్యాయ విభాగం అభియోగాలు నమోదు చేసిన పలువురిని ఇటీవలే భారత్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిని అమెరికాకు అప్పగించే అంశంపై చర్చలు సాగుతున్నాయి. కాగా గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా.. భారతదేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచి. కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. అయితే కేవలం అమెరికాలోనే కాక.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు. (చదవండి...కాల్ సెంటర్ కేసులో ఐపీఎస్ కొడుకు?) -
కాల్ సెంటర్ కేసులో ఐపీఎస్ కొడుకు?
ముంబై: అమెరికా రెవెన్యూ అధికారులుగా మాట్లాడుతూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్న థానే ‘కాల్‌సెంటర్ రాకెట్’కు సంబంధించిన విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ రాకెట్ వెనక గుజరాత్‌కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కుమారుడి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మిరా రోడ్లో అక్రమంగా నడుపుతున్న ఏడు కాల్ సెంటర్లపై ఈ నెల తొలి వారంలో క్రైం బ్రాంచి పోలీసులు దాడి చేసి 70 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరో 630మందిపై ఐపీసీ సెక్షన్ 384, 419,429 కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఐటీ యాక్ట్, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించి ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో కాల్ సెంటర్లను ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కొడుకు నడిపిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అక్కడి పోలీసులకు అందించినట్లు చెప్పారు. అరెస్టయిన వారిని విచారించగా.. 2009 నుంచి ప్రహ్లాద్ నగర్లో అక్రమంగా కాల్‌సెంటర్లు నడిపిస్తున్నట్లు వెల్లడించారన్నారు. ఈ రాకెట్‌కు సంబంధించి అహ్మదాబాద్‌లోని మరో 5 కాల్ సెంటర్లపై ఇటీవల పోలీసులు దాడి చేశారు. అమెరికాలో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని.. అక్కడ ఎవరెవరు పన్నులు ఎగ్గొడుతున్నారో జాబితా సేకరించి.. వాళ్లను బెదిరించడానికి షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ అనే యువకుడు ఇక్కడ ప్రత్యేకంగా ఏడు అంతస్థుల భవనంలో ఒక కాల్‌సెంటర్ నియమించి అతి తక్కువ కాలంలోనే 500 కోట్ల రూపాయలు సంపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షాగీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కాల్ సెంటర్ రాకెట్ మాస్టర్ మైండ్ జగదీశ్ని పోలీసులు గతరాత్రి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. -
స్కాం చేసి.. గర్ల్‌ఫ్రెండుకు 2.5 కోట్ల కారు గిఫ్ట్
ఎక్కడో మహారాష్ట్రలోని థానె ప్రాంతంలో ఉండి.. అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి 500 కోట్ల రూపాయలు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ (23) ఆ డబ్బుతో మంచి విలాసవంతమైన జీవితం ఆస్వాదించాడు. తన గర్ల్‌ఫ్రెండుకు రూ. 2.5 కోట్లు పెట్టి ఆడి ఆర్8 కారు పుట్టినరోజు బహుమతిగా కొనిచ్చాడు. ఈ విషయాన్ని థానె పోలీసులు తెలిపారు. షాగీ దగ్గర కూడా లెక్కలేనన్ని హై ఎండ్ కార్లు ఉన్నాయి. ఆడి ఆర్8 కారును అహ్మదాబాద్‌లో కొన్న తొలి వ్యక్తి ఇతడే. అయితే, అసలు ఇంత ఖరీదైన బహుమతి అందుకున్న అతడి గర్ల్ ఫ్రెండు ఎవరన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలియలేదు. ఆమె ఆనుపానులు కనిపెట్టి, కారును కూడా స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షాగీ స్కూలు స్నేహితులలో కొందరిని అరెస్టు చేసి విచారించినప్పుడు ఈ విషయం తెలిసింది. ఈ బహుమతి గురించి షాగీ తరచు తమతో చెప్పేవాడని అంటున్నారు. థానె నుంచి అహ్మదాబాద్ వెళ్లిన తర్వాత సాగర్ ఠక్కర్ తన సోదరి రీమా ఠక్కర్తో కలిసి ఉండేవాడు. అమెరికాలో ఈ స్కాంకు మరో సూత్రధారి ఉన్నాడని.. అతడితో స్నేహం మొదలైన తర్వాతే స్కాం మొత్తం మొదలైందని పోలీసులు చెప్పారు. అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్లకు సంబంధించిన వివరాలు తీసుకుని.. వాటిని సాగర్‌కు పంపేవాడు. వాటి ఆధారంగా ఇక్కడినుంచి అమెరికన్ పౌరులకు ఫోన్లు చేసి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేవారు. సాగర్‌కు దుబాయ్‌లో కూడా భారీ ఎత్తున వ్యాపారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ దండుకున్న డబ్బులతోనే ఆ వ్యాపారం పెట్టాడంటున్నారు. థానెకు ఎఫ్‌బీఐ అధికారులు అమెరికా పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ దోపిడీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఎఫ్‌బీఐ నుంచి ఏడుగురు అధికారులు వస్తున్నారు. థానె పోలీసు కమిషనరేట్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీపీ పరమ్‌వీర్ సింగ్ చెప్పారు. అహ్మదబాద్ నుంచి ముంబైకి మనీలాండరింగ్ చేస్తున్న నలుగురు హవాలా ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను ఈ కేసులో సాక్షులుగా చేస్తామంటున్నారు. అమెరికాకు, అహ్మదాబాద్‌కు మధ్య ఎలాంటి లింకు ఉందో తేలుస్తామని చెబుతున్నారు.