![Shark Tank India Fame Ghazal Alagh Buy Swanky Audi e tron - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/4/audi.jpg.webp?itok=pjgNGR9F)
'షార్క్ ట్యాంక్ ఇండియా షో' ఫేమ్ గజల్ అలగ్ కొత్త కారు కొనుగోలు చేసింది. రూ.1.19 కోట్ల ఖరీదైన ఆడి ఈ త్రోన్ అనే లగ్జరీ కారును తన గ్యారేజీలోకి తచ్చుకుంది. భర్త వరుణ్‌తో కలిసి కారు ముందు దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా రెండు నెలల క్రితమే ఆమె ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గజల్, వరుణ్ 2016లో మామాఎర్త్ ఫౌండేషన్‌ను స్థాపించారు. తమ కొడుకు అగస్త్యకు మార్కెట్‌లో సహజ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఎంతో కష్టపడ్డామని, ఆ క్రమంలోనే మామాఎర్త్‌ను స్థాపించాలన్న ఆలోచన పుట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
పలు స్టార్టప్స్‌కు, మంచి ఐడియాతో వచ్చే ఎంట్రప్రెన్యూర్స్‌కు షార్క్ ట్యాంక్ ఇండియా ఫండింగ్‌ను అందిస్తోంది. ఇది ఒక బిజినెస్ రియాలిటీ షో. భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, boAt సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమన్ గుప్తా, Shaadi.com, పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీఈవో అనుపమ్ మిట్టల్ సహా నమితా థాపర్, వినీతా సింగ్, పీయుష్ బన్సల్ వంటి బడా పారిశ్రామికవేత్తలు ఈ షోలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
చదవండి: సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు!
Comments
Please login to add a commentAdd a comment