శివకార్తికేయన్‌ బాటలో ఉదయనిధి | Tamil remake of Malayalam film 'Magsaysinde Pradeegaram' hero Udayanidhi Stalin | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్‌ బాటలో ఉదయనిధి

Published Wed, Jul 12 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

శివకార్తికేయన్‌ బాటలో ఉదయనిధి

శివకార్తికేయన్‌ బాటలో ఉదయనిధి

తమిళసినిమా :  మలయాళంలో ఘన విజయం సాధించిన ‘మగేషిండె ప్రదీగారం‘ చిత్రం ఇప్పుడు తమిళంలో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో, ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా రీమేక్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని ‘మూన్‌ షూట్‌’ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అనే కొత్త చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. రెండు జాతీయ పురస్కారాలు, ఐదు రాష్ట్ర అవార్డులు, రెండు ఫిలింఫేర్‌లతోపాటు పలు ప్రైవేటు టీవీ సంస్థల అవార్డులను పొందిన ‘మగేషిండె ప్రదీగారం‘ చిత్రానికి తమిళంలో ఇంకా పేరు ఖరారు కాలేదు.

ఇందులో ఉదయనిధి స్టాలిన్‌ సరసన పార్వతి నాయర్, ప్రముఖ మలయాళ నటీమణి నమితా ప్రమోద్‌లు నాయకిలుగా నటిస్తుండగా, వీరితోపాటు సముద్రఖని, ఎంఎస్‌.భాస్కర్, కరుణాకరన్‌ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని డైలాగ్‌లు రాస్తుండగా, టర్‌బుకా శివ సంగీతం సమకూరుస్తున్నారు. ఏకాంబరం స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం చెన్నైలో ‘ఫోర్‌ ఫ్రేమ్స్‌’ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ నెల 19వ తేదీ నుంచి కుట్రాళం, తెన్‌కాశి ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహించనున్నారు.

దర్శకుడు ప్రియదర్శన్, ఉదయనిధి స్టాలిన్‌ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. కాగా, ఇప్పటికే కుట్రాళంలో పొన్‌రామ్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటిస్తున్న చిత్ర షూటింగ్‌ జరుగుతోంది. కొన్ని రోజులుగా శివకార్తికేయన్‌ అక్కడ బస చేసి నటిస్తున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే ఉదయనిధి కూడా కొత్త చిత్రం షూటింగ్‌ కోసం అక్కడికి చేరుకోవడం విశేషం. దీంతో ఒకేసారి ఇద్దరు యువ హీరోల చిత్రాల షూటింగ్‌లు జరుగుతండడంతో కుట్రాళంలో తారల కళ సంతరించుకుంది. షూటింగ్‌ చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement