మీడియాపై నమిత ఫైర్‌ | Actress Namithapramod Fires on Media | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 10 2018 8:06 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

Actress Namithapramod Fires on Media - Sakshi

సాక్షి, తమిళసినిమా: ఏమిటీ.. నమిత అనగానే ఆసక్తి పెరిగిపోయిందా! అయితే.. మీడియా ఫైర్‌ అయింది.. ‘మచ్చాస్‌’ అంటూ అభిమానులను ప్రేమగా పలకరించే నమిత కాదులెండి. అదే పేరుతో మలయాళ చిత్రసీమలో ఓ బ్యూటీ ఉంది.  ఆమె పూర్తి పేరు నమితాప్రమోద్‌. తెలుగులో ఆది సరసన ‘చుట్టాలబ్బాయ్‌’, కోలీవుడ్‌లోనూ ‘ఎన్‌ కాదల్‌ పుదిదు’ , ‘నిమిర్‌’ లాంటి చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది. ఈ భామ గురించి ఇటీవల కొన్ని గాసిప్స్‌ ప్రచారం అయ్యాయి. దీంతో మీడియా ఫోకస్‌  ఆమెపై పడింది. ఇంతకీ ఈ భామకు ఆవేశానికి కారణం ఏమిటంటే..  

‘చిత్ర పరిశ్రమలో ఏ సమస్య తలెత్తినా.. దానితో నాకు సంబంధం లేకపోయినా అందులో నా పేరు చేర్చేస్తున్నారు. ఏ విషయాన్నైనా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేది మీడియానే. అయితే అందులో నిజాలు ఉండేలా చూసుకోవాలి. దేని గురించి అయినా రాసేటప్పుడు దాని గురించి సంబంధిత వ్యక్తులతో సంప్రదించి.. నిజానిజాలను తెలుసుకొని రాయాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదోదే రాసేయకూడదు. కొన్ని సంఘటనల్లో నా పేరు చేర్చి వివాదాల్లోకి లాగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది’ అని నమితా ప్రమోద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఈ గాసిప్స్‌ వల్ల ఇబ్బందిపడుతున్న నాకు కుటుంబం అండగా నిలుస్తోంది. ఇకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి నాకలాంటి ఆలోచన లేదు. వివాహం తరువాత ఏ అమ్మాయి అయినా తన భర్తపై దృష్టి పెట్టాల్సిఉంటుంది. కాబట్టి మరో మూడేళ్ల వరకు నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు’ అని నమితాప్రమోద్‌ వివరణ ఇచ్చారు. ఇంతకీ ఈ అమ్మడి ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. ఆ మధ్య మలయాళ చిత్రసీమను కుదిపేసిన ఒక ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ఈమె కూడా రావడమే. ఈ కేసులో తన పేరు ఎందుకు లాగుతున్నారంటూ మీడియా మీద నమితాప్రమోద్‌ తెగ ఫైర్‌ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement