malayalam actress attack case
-
మీడియాపై నమిత ఫైర్
సాక్షి, తమిళసినిమా: ఏమిటీ.. నమిత అనగానే ఆసక్తి పెరిగిపోయిందా! అయితే.. మీడియా ఫైర్ అయింది.. ‘మచ్చాస్’ అంటూ అభిమానులను ప్రేమగా పలకరించే నమిత కాదులెండి. అదే పేరుతో మలయాళ చిత్రసీమలో ఓ బ్యూటీ ఉంది. ఆమె పూర్తి పేరు నమితాప్రమోద్. తెలుగులో ఆది సరసన ‘చుట్టాలబ్బాయ్’, కోలీవుడ్‌లోనూ ‘ఎన్ కాదల్ పుదిదు’ , ‘నిమిర్’ లాంటి చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది. ఈ భామ గురించి ఇటీవల కొన్ని గాసిప్స్ ప్రచారం అయ్యాయి. దీంతో మీడియా ఫోకస్ ఆమెపై పడింది. ఇంతకీ ఈ భామకు ఆవేశానికి కారణం ఏమిటంటే.. ‘చిత్ర పరిశ్రమలో ఏ సమస్య తలెత్తినా.. దానితో నాకు సంబంధం లేకపోయినా అందులో నా పేరు చేర్చేస్తున్నారు. ఏ విషయాన్నైనా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేది మీడియానే. అయితే అందులో నిజాలు ఉండేలా చూసుకోవాలి. దేని గురించి అయినా రాసేటప్పుడు దాని గురించి సంబంధిత వ్యక్తులతో సంప్రదించి.. నిజానిజాలను తెలుసుకొని రాయాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదోదే రాసేయకూడదు. కొన్ని సంఘటనల్లో నా పేరు చేర్చి వివాదాల్లోకి లాగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది’ అని నమితా ప్రమోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ గాసిప్స్ వల్ల ఇబ్బందిపడుతున్న నాకు కుటుంబం అండగా నిలుస్తోంది. ఇకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి నాకలాంటి ఆలోచన లేదు. వివాహం తరువాత ఏ అమ్మాయి అయినా తన భర్తపై దృష్టి పెట్టాల్సిఉంటుంది. కాబట్టి మరో మూడేళ్ల వరకు నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు’ అని నమితాప్రమోద్ వివరణ ఇచ్చారు. ఇంతకీ ఈ అమ్మడి ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. ఆ మధ్య మలయాళ చిత్రసీమను కుదిపేసిన ఒక ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ఈమె కూడా రావడమే. ఈ కేసులో తన పేరు ఎందుకు లాగుతున్నారంటూ మీడియా మీద నమితాప్రమోద్ తెగ ఫైర్ అవుతున్నారు. -
'మా హీరో తలుచుకుంటే.. మీరు సెక్స్క్లిప్ అవుతారు’
మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు ఈ నెల 3న బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో గడిపిన అనంతరం దిలీప్ బయటకు రావడంతో ఆనందం తట్టుకోలేకపోయిన ఆయన అభిమాని ఒకరు ఫేస్బుక్లో ఒక విపరీతమైన వ్యాఖ్య చేశాడు. దిలీప్‌కు మద్దతునివ్వని వారిని బెదిరిస్తూ మలయాళంలో అతను పెట్టిన పోస్టు దుమారం రేపుతోంది. ’దిలీప్‌కు వ్యతిరేకంగా మాట్లాడే స్త్రీవాదులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేరళ ఇంకా అసలైన కొటేషన్ (నేరం చేసేందుకు ఇచ్చే కాంట్రాక్టు) చూడలేదు. దిలీప్ కోరుకుంటే.. మీరు పురుషుల ఫోన్లలో సెక్స్క్లిప్గా మారిపోతారు’అంటూ అతను కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌ను ’లాసర్స్ మీడియా’ అనే ఫేస్బుక్ పేజీ పోస్టు చేయగా.. దాని స్క్రీన్‌షాట్‌ను లైంగిక వేధింపులకు గురైన సినీ నటి తన స్నేహితురాలు రిమా కల్లింగల్కు పంపింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ఫేస్బుక్లో పోస్టు చేసిన నటి రిమా.. అందులో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ’ఫిబ్రవరి 17న కిరాతకమైన దాడికి గురైన నా స్నేహితురాలు తన చుట్టూ జరుగుతున్న ప్రతిదీ చూస్తోంది. ప్రతిదీ వింటోంది. ఈ స్క్రీన్‌షాట్‌ను తనే పంపింది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఒక్కడి పోస్టు వల్ల మహిళలు పురుషులందరినీ అదేగాటున వేసి కించపరచవద్దని, నిజమైన పురుషులు మహిళలకు అండగా ఉంటారని, వారిని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఆమె పోస్టును ’నల్లవనోప్పమ్’ (మంచి పురుషులతో), ’అవల్క్కోపమ్’ (ఆమె వెంటే) హ్యాష్‌ట్యాగ్‌లతో పెద్ద ఎత్తున నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. నటుడు దిలీప్.. నటి రిమా కల్లింగల్ -
నటి కేసు: యువనటుడి ఇంట్లో నిందితుడు!
కొచ్చి: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, దాడి కేసులో పలు సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు తాజాగా మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చి కక్కనాడ్‌లోని ఓ ఫ్లాటులో అతను దాక్కుని ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. కదులుతున్న కారులో నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుల్లో అతను కూడా ఒకడని తెలుస్తోంది. అయితే, అతను తలదాచుకున్న ఫ్లాటు మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటుడు-దర్శకుడిదని తేలడం కలకలం రేపుతోంది. నటిపై దాడి కేసులో తాజాగా అరెస్టైన నిందితుడికి నేరుగా సంబంధాలు ఉంటే.. అతడు దాక్కునేందుకు అనుమతించిన సదరు యువనటుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే, అదుపులోకి తీసుకున్న నిందితుడి గురించి పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మరోవైపు ఈ కేసుకు మాలీవుడ్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానాలు వెలువడటం ప్రకంపనలు రేకెత్తిస్తోంది. నటి ప్రయాణ వివరాలను నిందితులకు చేరవేసింది ఫిలిం యూనిట్ సభ్యుడేనని తాజాగా పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు ప్రధాన సూత్రధారి అయిన పల్సర్ సునికి మలయాళ సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతను సినీ పెద్దలకు అశ్లీల సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడని పోలీసులు అంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం బాధితురాలైన సినీ నటి చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు నలుగురిపైనా పోలీసులు నజర్ పెట్టారని, వారు కూడా పల్సర్ సుని గ్యాంగ్‌తో కుమ్మక్కై సమాచారం అందించి ఉంటారని చెప్తున్నారు.