నటి కేసు: యువనటుడి ఇంట్లో నిందితుడు! | actress case, police nab suspect from actor flat | Sakshi
Sakshi News home page

నటి కేసు: యువనటుడి ఇంట్లో నిందితుడు!

Published Wed, Feb 22 2017 11:22 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

నటి కేసు: యువనటుడి ఇంట్లో నిందితుడు!

నటి కేసు: యువనటుడి ఇంట్లో నిందితుడు!

కొచ్చి: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్‌, దాడి కేసులో పలు సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు తాజాగా మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చి కక్కనాడ్‌లోని ఓ ఫ్లాటులో అతను దాక్కుని ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. కదులుతున్న కారులో నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుల్లో అతను కూడా ఒకడని తెలుస్తోంది. అయితే, అతను తలదాచుకున్న ఫ్లాటు మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటుడు-దర్శకుడిదని తేలడం కలకలం రేపుతోంది. నటిపై దాడి కేసులో తాజాగా అరెస్టైన నిందితుడికి నేరుగా సంబంధాలు ఉంటే.. అతడు దాక్కునేందుకు అనుమతించిన సదరు యువనటుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే, అదుపులోకి తీసుకున్న నిందితుడి గురించి పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

మరోవైపు ఈ కేసుకు మాలీవుడ్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానాలు వెలువడటం ప్రకంపనలు రేకెత్తిస్తోంది. నటి ప్రయాణ వివరాలను నిందితులకు చేరవేసింది ఫిలిం యూనిట్‌ సభ్యుడేనని తాజాగా పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు ప్రధాన సూత్రధారి అయిన పల్సర్‌ సునికి మలయాళ సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతను సినీ పెద్దలకు అశ్లీల సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడని పోలీసులు అంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం బాధితురాలైన సినీ నటి చేస్తున్న చిత్ర యూనిట్‌ సభ్యులు నలుగురిపైనా పోలీసులు నజర్‌ పెట్టారని, వారు కూడా పల్సర్‌ సుని గ్యాంగ్‌తో కుమ్మక్కై సమాచారం అందించి ఉంటారని చెప్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement