కుర్రాడు రఫ్‌ | kathalo rajakumari is planning to release on June 30 | Sakshi
Sakshi News home page

కుర్రాడు రఫ్‌

Published Mon, May 29 2017 2:20 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

కుర్రాడు రఫ్‌

కుర్రాడు రఫ్‌

ఓ వైపు క్లాస్‌.. మరో వైపు మాస్‌ పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నారు నారా రోహిత్‌. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ జోరుగా దూసుకెళుతున్న రోహిత్‌ నటించిన తాజా చిత్రం ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య తారలుగా మహేశ్‌ సూరపనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.

దర్శకుడు మాట్లాడుతూ– ‘‘తెలుగు తెరపై ఇప్పటి వరకూ చూడని విభిన్నమైన పాత్రలో నారా రోహిత్‌ కనిపిస్తారు. ఆయనది రఫ్‌ క్యారెక్టర్‌. రోహిత్, నాగ శౌర్య మధ్య సన్నివేశాలు హైలైట్‌.  ఇళయరాజాగారు ఈ చిత్రానికి రెండు పాటలకు ట్యూన్స్‌ అందించడం విశేషం. విశాల్‌ చంద్రశేఖర్‌ మరో ఐదు పాటలను స్వరపరిచారు. ఈ చిత్రాన్ని జూన్‌ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నరేష్‌ కె. రాణా, సమర్పణ: రాజేష్‌ వర్మ సిరివూరి, నిర్మాణం: ఆరోహి సినిమా, అరన్‌ మీడియా వర్క్స్, శ్రీహాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధాకర్‌ ఇంపెక్స్‌(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement