రాయాల కపిల్, చాణిక్యా, విశ్వ తేజ్, శోభన్ బోగరాజు, విక్కీ, శ్రీనివాస్ కసినికోట, హనుమాద్రి శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అచీవర్. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్, రాయల సతీష్, సారా కళ్యాణ్ గౌడ్ ఈ ఇండిపెండెట్ ఫిలింను కలిసి నిర్మించారు. తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిల్డ్రన్స్ ఇండిపెండెట్ సినిమాకు లక్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్సొలేషన్ స్థానం లభించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ వెల్లడించారు.
వెంకటేష్ ఉప్పల, సుమంత్ బొర్ర అందించిన సంగీతం, పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయన్నారు. నటనలో ఎలాంటి అనుభవం లేని పిల్లలు చాలా బాగా యాక్ట్ చేశారన్నారు. దేశభక్తి , దేశం మీద గౌరవం అనేది చిన్ననాటి నుంచే పిల్లలకు తెలియాలని, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం, ఎంతో మంది కృషి వల్లే ఈ దేశం మనకు వచ్చింది అని మేకర్స్ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ టైమ్స్ యుట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు..
Comments
Please login to add a commentAdd a comment