![Hats Off Police Movie Won Two Awards at International Mega Film Festival](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/hatsoff.jpg.webp?itok=6WMZrEa-)
హ్యాట్సాఫ్ పోలీస్ (Hats Off Police) చిత్రానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఆదివారం (ఫిబ్రవరి 9వ తేదీ) నాడు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ మెగా ఫిల్మ్ ఫెస్టివల్ 2025 కార్యక్రమం జరిగింది. సినీ దర్శకుడు, హ్యాట్సాఫ్ పోలీస్ హీరో రెడ్డెం యాదకుమార్‌కు ఉత్తమ నటుడి అవార్డు వరించింది. అలాగే ఈ సినిమా రచయిత చిత్ర రచయిత, దర్శకులు జీ.వి. త్రినాధ్‌లు ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్నారు. ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ఇండియన్ పొలిటీషియన్ వేణుగోపాలా చారి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్, సినీ నటులు పుష్ప మహేష్ చేతుల మీదుగా అవార్డులు అందించారు.
అవార్డుల ప్రదానం అనంతరం అతిధులు మాట్లాడుతూ రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం అభినందనీయం అన్నారు. మరిన్ని సమాజ హిత చిత్రాలు వీరి ద్వారా నిర్మితం అవ్వాలని, చిత్ర నిర్మాతలు పైడి శంకరరావు, కోరుకొండ లీలాకుమారి లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న రెడ్డం యాదకుమార్ మాట్లాడుతూ.. ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనను ఎంపిక చేసిన జ్యూరీ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. యాదకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో "కంచర్ల" చిత్రం రూపొందుతోంది. ఇది త్వరలోనే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment