ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేది లేదు | I’m not getting married anytime soon : Swathi | Sakshi
Sakshi News home page

ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేది లేదు

Published Sun, Sep 14 2014 4:07 PM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేది లేదు - Sakshi

ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేది లేదు

తాను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని హీరోయిన్ కలర్స్ ఫేం స్వాతి కుండ బద్దలు కొట్టింది. మీడియాలో తన ప్రేమ... పెళ్లి అంటూ ఇటీవల మీడియాలో జోరుగా సాగుతున్న ప్రచారం పెద్ద సిల్లి అంటూ కొట్టిపారేసింది. తాను ఓ తమిళ హీరోతో ప్రేమలో పడినట్లు... పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు... అందుకు ఇరు కుటుంబాల పెద్దలు తమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుగులో ఓ టీవీ ఛానల్ కథనాన్ని కూడా ప్రసారం చేసింది. దాంతో స్వాతి ఆదివారం పైవిధంగా స్పందించింది.

తాను ఇంట్లోని ఫ్రిజ్లోని ఆహార పదార్థాలను ఎంతో రోమాంటిక్గా ఇష్టపడతానని సెలవిచ్చింది. తనకు పెళ్లి అంటూ ప్రచారం జరగడం ఇదే ప్రధమం కాదని చెప్పింది. ఈ ఏడాది మే మాసంలో తనకు పెళ్లి అంటూ మీడియా ప్రచారం మొదలు పెట్టిందని తెలిపింది. చెన్నైలో షూటింగ్ కోసం అక్కడ ఉన్నానని అక్కడే ఉంటే అక్కడి వ్యక్తితో ప్రేమలో పడినట్టేనా అని ప్రశ్నించింది. తాను నటించిన కార్తీకేయ చిత్రం విడుదలకు సిద్దమవుతుందని స్వాతి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement