
టిక్‌టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది నయని పావని

ఈమె అసలు పేరు సాయి పవని రాజ్. పక్కా తెలంగాణ అమ్మాయి

టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ బుట్టలో వేసుకుంది

సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి పలు షార్ట్ ఫిలింస్‌లోనూ నటించింది

ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు

ఆ మధ్య డ్యాన్స్ షో ఢీలోకి వెళ్లి మంచి గుర్తింపు పొందింది

షార్ట్ ఫిలింస్, రియాలిటీ షోలే కాదు సినిమాలు కూడా చేసింది

చిత్తం మహారాణి, సూర్యకాంతం అనే చిత్రాల్లో నటించి మెప్పించింది

అందానికి అందం, దానికి మించి టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ తాజాగా బిగ్‌బాస్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది





















