
అదృశ్యమైన పావని (ఫైల్)
బంజారాహిల్స్: తానిక్కడే ఉంటే పెళ్లి చేస్తారని, తనకు ఉన్నత చదువులు చదువుకోవాలని ఉందని ఎక్కడైనా హాస్టల్‌లో ఉండి చదువుకుంటానంటూ లేఖ రాసి ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ శివమ్మపాపిరెడ్డిహిల్స్ బ్రహ్మశంకర్‌నగర్‌లో ఉంటున్న ఈశ్వరమ్మ–ఎల్లయ్య దంపతుల కూతురు ఆర్. పావని(16)ఈ నెల 9న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ‘తనకు చదువుకోవాలని ఉందని ఏదైనా హాస్టల్‌లో చేరుతానంటూ లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 7901103898 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment