
హోమానంద్, పావని జంటగా జైరామ్ కుమార్ దర్శకత్వంలో ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ హోమానంద్’. బోలే షావళి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేశారు. ట్రైలర్, బిగ్ సీడీని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘మిస్టర్ హోమానంద్’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
‘‘హారర్, కామెడీ జానర్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఈ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది’’ అన్నారు జైరామ్ కుమార్. ‘‘మా గురువుగారు కేశవ తీర్థగారి వల్లే సినిమారంగంలోకి వచ్చా. మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం. ఇంద్రసేనా రెడ్డి. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. నా నటన చూసి సీనియర్ యాక్టర్‌లా చేసావని అంటుంటే వెరీ హ్యాపీ’’ అన్నారు హోమానంద్.
Comments
Please login to add a commentAdd a comment