నాలుగు భాషల్లో... | Ampasayya novel in 4 languages | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల్లో...

Published Mon, May 23 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

నాలుగు భాషల్లో...

నాలుగు భాషల్లో...

ప్రముఖ రచయిత నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన చిత్రం ‘క్యాంపస్ అంపశయ్య’. శ్యామ్ కుమార్, పావని జంటగా ప్రభాకర్ జైని ప్రధాన పాత్రలో జైని క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవరాయ ఫిలిమ్స్‌పై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మానవ విలువలు, మానసిక సంఘర్షణలున్న చిత్రమిది. అన్ని భాషల వారికి సరిపోయే కథ కావడంతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నాం.

చదువు కోసం ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చే కుర్రాడి జీవితంలో ఒక రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి సంఘటనలు జరిగాయన్నదే కథ. 1970ల కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమేరా: రవికుమార్ నీర్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement