
కన్నీటి కథ... ‘అంపశయ్య’
ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఇప్పుడు వెండి తెరపై ఆవిష్కృతం కావడానికి సిద్ధమైంది. శ్యామ్ కుమార్, పావని జంటగా ‘అమ్మా నీకు వందనం’ ఫేవ్‌ు ప్రభాకర్ జైని దర్శకత్వంలో విజయలక్ష్మి జైని నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘1965-1970 కాలంలోని పేదరికం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కొడుకు చదువు కోసం రూ. 200 కూడా చెల్లించలేని పేదరికం తండ్రిది. ఫీజు కోసం భార్య కడియాలు అమ్మినా డబ్బు సరిపోక, ఆ తండ్రి నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తాడు. ఆ సీన్‌లో వచ్చే పాట, అందులోని సాహిత్యం గుండెలు పిండేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో, మలయాళంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్ నీర్ల. సంగీతం: సందీప్.