ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీలో నిద్రమాత్రలు కలిపి | Chikkamagaluru District Yagati Police Arrested a Wife Who Killed Her Husband - Sakshi
Sakshi News home page

ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీలో నిద్రమాత్రలు కలిపి

Aug 15 2023 8:14 AM | Updated on Aug 24 2023 5:10 PM

wife kills husband - Sakshi

ప్రేమికునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యను చిక్కమగళూరు జిల్లా యగటి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కర్ణాటక: ప్రేమికునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యను చిక్కమగళూరు జిల్లా యగటి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కడూరు తాలూకా హనుమనహళ్లికి చెందిన పావనికి నవీన్‌ (29)తో ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. ఇటీవల భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త గొడవ పడగా పెద్దలు రాజీ పంచాయతీ చేశారు.

ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీల్లో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. భర్త తిని నిద్రలోకి వెళ్లగానే ప్రియునితో కలిసి హత్య చేసి మూడు కిలోమీటర్ల దూరంలో పడేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది. అయితే  ఇది ఆత్మహత్య కాదని తెలిసి పావనిని విచారించగా నిజం చెప్పింది. ఇద్దరినీ అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement