Arjun Yajath
-
ట్రాన్స్‌జెండర్‌గా సీజన్-7 బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ విన్నర్‌గా రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ సీజన్లో టాప్-3లో ప్రశాంత్, అమర్దీప్, శివాజీ నిలవగా.. యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్ కావడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టినవాళ్లు ఉన్నారు. అయితే బిగ్‌బాస్ కంటే ముందే ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటుడు టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఉన్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా షో మధ్యలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో నలుగురు ఎమిలినేట్ అవ్వగా.. కేవలం అర్జున్ అంబటి మాత్రమే టాప్-6లో నిలిచారు. అయితే అర్జున్ హౌస్‌లోకి రాకముందే పలు సినిమాల్లో నటించారు. చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేశాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!) ఆ తర్వాత మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన సౌఖ్యంలో విలన్‌గా నటించారు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటనపై మక్కువతోనే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్‌బాస్ షోను ఎంచుకున్నారు. అర్ధనారిలో ట్రాన్స్‌జెండర్‌గా.. అర్ధనారి సినిమాలో అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మెప్పించారు. చాలా అరుదైన పాత్రలో కనిపించిన అర్జున్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ 2016లో నిర్మించిన చిత్రమే అర్ధనారి. ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించిన అర్జున్ అంబటి ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్లో కనిపించి మరింత ఫేమస్ అయ్యారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్-6లో నిలిచారు. అంతేకాకుండా బుచ్చిబాబు సనా తెరకెక్కించే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు. ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
అది మా అదృష్టం
‘‘మూడు పువ్వులు ఆరు కాయలు’ సినిమా మూడు సార్లు ఆగిపోయింది. ఆరు మంది నిర్మాతలు మారారు. చివరకు మా ఫ్రెండ్ వబ్బిన వెంకట్రావు నిర్మాతగా ఈ సినిమా పూర్తి చేశాం’’ అని డైరెక్టర్ రామస్వామి అన్నారు. ‘‘అర్ధనారి’ ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో వెంకట్రావు నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో రామస్వామి మాట్లాడుతూ– ‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురువారం విడుదలైంది. మా సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రానికి మేం పోటీ కాదు. మాకు ఎన్టీఆర్ గారంటే గౌరవం, త్రివిక్రమ్‌గారంటే ఇష్టం. వాళ్ల సినిమా మధ్య మా చిత్రం విడుదల చేయడం మా అదృష్టం. ఆ సినిమాకు వచ్చిన ఓవర్ ఫ్లోతో మా హాల్ నిండినా చాలనుకున్నాం’’ అన్నారు. డా.మల్లె శ్రీనివాసరావు, భరత్ బండారు, వబ్బిన వెంకట్రావు, సంగీత దర్శకుడు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. -
చచ్చేదాకా కలిసి ఉండటమే
‘అర్ధనారి’ ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. రామస్వామి దర్శకత్వంలో డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో వెంకట్రావు నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. పాటల రచయిత భాస్కరభట్ల, సంగీత దర్శకుడు సాయికార్తీక్ చిత్ర ట్రైలర్‌ను, పాటలను విడుదల చేశారు. రామస్వామి మాట్లాడుతూ– ‘‘ప్రేమంటే చంపుకోవడమో, చావడమో కాదు.. చచ్చేదాకా కలిసి బతకటం. కన్నవాళ్ల కలలతో పాటు, ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వర్ధిల్లుతుంది. మా నిర్మాత, సమర్పకులే నన్ను నడిపించారు. మా చిత్రంలో చంద్రబోస్‌గారు రాసిన పాట గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటారు’’ అన్నారు. ‘‘మా స్మైల్ పిక్చర్స్ బ్యానర్లో ఇది తొలి సినిమా. మా టీమ్ చాలా కష్టపడి చేశారు’’ అన్నారు వెంకట్రావు. చిత్ర సమర్పకులు డా. మల్లె శ్రీనివాస్, డైరెక్టర్ దేవీప్రసాద్, నటులు భరత్, అర్జున్ యజత్, పావని, సీమా చౌదరి, సంగీత దర్శకుడు కృష్ణసాయి, ఆర్ట్ డైరక్టర్ రమణ, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు పువ్వులు ఆరు కాయలు
అర్జున్ యజత్, భరత్ బండారు, రామస్వామి హీరోలుగా, సౌమ్య వేణుగోపాల్, పావని, సీమా చౌదరీలు హీరోయిన్లుగా డా. మల్లె శ్రీనివాసరావు సమర్పణ లో పెబ్బిన వెంకటరావు నిర్మాతగా రామస్వామి దర్శకత్వం వహించిన సినిమా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. ప్రేమ గొప్పదే.. కానీ జీవిత లక్ష్యం ఇంకా గొప్పది. ప్రేమ కోసం చావటం, చంపటం కాదు. మన కన్నవాళ్ల కలల్ని, మనం అనుకున్న లక్ష్యాన్ని నిజం చేస్తేనే జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. సినిమాలో హాస్య రసంతో పాటు కరుణరసం కూడా ఉంటుంది. 40 సినిమాలకు రచయితగా చేసిన రామస్వామిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘మంచి కాన్సెప్ట్‌తో సకుటుంబాన్ని ఆదరించేలా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు. తనికెళ్ల భరణి, అజయ్‌ఘోష్, కృష్ణభగవాన్ తదితరులు నటించారు. -
గీతోపదేశం మూవీ స్టిల్స్