ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ విన్నర్‌గా రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ సీజన్‌లో టాప్-3లో ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ నిలవగా.. యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్ కావడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టినవాళ్లు ఉన్నారు. అయితే బిగ్‌బాస్ కంటే ముందే ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటుడు టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఉన్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా షో మధ్యలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో నలుగురు ఎమిలినేట్ అవ్వగా.. కేవలం అర్జున్ అంబటి మాత్రమే టాప్-6లో నిలిచారు. అయితే అర్జున్ హౌస్‌లోకి రాకముందే పలు సినిమాల్లో నటించారు. చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేశాడు.
(ఇది చదవండి: బిగ్ బాస్ అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!)
ఆ తర్వాత మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన సౌఖ్యంలో విలన్‌గా నటించారు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటనపై మక్కువతోనే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్‌బాస్ షోను ఎంచుకున్నారు.
అర్ధనారిలో ట్రాన్స్‌జెండర్‌గా..
అర్ధనారి సినిమాలో అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మెప్పించారు. చాలా అరుదైన పాత్రలో కనిపించిన అర్జున్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ 2016లో నిర్మించిన చిత్రమే అర్ధనారి. ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించిన అర్జున్ అంబటి ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్‌లో కనిపించి మరింత ఫేమస్ అయ్యారు. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్-6లో నిలిచారు. అంతేకాకుండా బుచ్చిబాబు సనా తెరకెక్కించే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు. ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment