రాసలీలలు సాగించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జ్యోతిస్కుడు దేవిశ్రీ రామస్వామి గురూజీ అలియాస్ రామస్వామి(రాము)పై స్థానిక హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరు, న్యూస్‌లైన్ : రాసలీలలు సాగించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జ్యోతిస్కుడు దేవిశ్రీ రామస్వామి గురూజీ అలియాస్ రామస్వామి(రాము)పై స్థానిక హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాము కారు డ్రైవర్ వసంత్, మేనేజర్ ఉదయ్ తమకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. తమను చంపేస్తానంటూ రాము బెదిరిస్తున్నాడని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పలు కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి.