Swamiji thief
-
స్వామీజీల మాయాజాలం.. లబోదిబోమంటున్న రైతులు
‘‘మీ రుద్రాక్షలకు ప్రత్యేక పూజలు చేస్తాం.. మేం హిమాలయాల్లో పొందిన జ్ఞానంతో వాటిని శక్తివంతం చేస్తాం.. అంతే! ఆ తర్వాత మీరు ఎనలేని సిరి సంపదలతో మీరు తులతూగుతారు.. పూజలో బంగారు నగలు కూడా పెడితే ధన, కనకలక్ష్మి అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది..’’ అని ఊదరగొట్టడంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు వారి చెప్పినట్లే అన్నీ చేశారు. చివరకు పూజాఫలంతో రాజస్థానీయులు అదృశ్యమయ్యారు. తాము మోసపోయామని లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీయడం బాధితుల వంతైంది. సాక్షి, మదనపల్లె : రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ కుమార్ కథనం .. తిరుపతి మారుతీ నగర్‌కు చెందిన అన్నదమ్ములు రామాయణం మురళి, విశ్వనాథ్ మదనపల్లె టమాట మార్కెట్లో రోజూ టమాటాలు కొని తీసుకెళ్తుంటారు. మంగళవారం వారిద్దరూ ఇదే కోవలో ఇక్కడికొచ్చి టమాటాలు లారీలలో తీసుకుని తిరుపతికి వెళుతుండగా బైపాసు రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్ వద్ద ఆరుగురు రాజస్థానీ స్వామీజీల బృందం వారిని ఆపింది. 45–60 ఏళ్ల వయస్కులైన వారి ఆహార్యం చూడగానే పేరున్న స్వామీజీలనే లెవెల్లో ఉండటంతో అన్నదమ్ములు వారికి నమస్కరించారు. మెడలో ఉన్న రుద్రాక్షలు తీసి పూజలో పెడితే, హిమాలయాల్లో పొందిన జ్ఞానంతో వాటికి శక్తిని చేకూర్చి అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేస్తామని వారిని నమ్మించారు. దీంతో సమీపంలోని తమ బంధువుల ఇంటికి స్వామీజీలను తీసుకెళ్లారు. ( చదవండి: ఏకైక సంతానం: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని..) వాళ్లు చెప్పిన ప్రకారం రూ.20వేలకు నెయ్యి, టెంకాయలు, కర్పూరం, నిమ్మకాయలు, కుంకుమ, అగరబత్తీలు ఇత్యాది పూజాసామగ్రిని తెచ్చి ఇచ్చారు. హోమగుండం ఏర్పాటు చేశారు. స్వామీజీల సూచన మేరకు అన్నదమ్ములిద్దరూ తమ మెడలోని 60 గ్రాముల బంగారు రుద్రాక్ష మాలలతోపాటు రూ.20వేలను వారికి ఇవ్వడంతో వాటిని పూజలో పెట్టారు. హిందీలో మంత్రాలు పఠిస్తూ హోమం చేశారు. మధ్య మధ్యలో టెంకాయలు కొడుతూ, కర్పూరం, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తూ షో రక్తి కట్టించారు. ఇలా పూజ చేస్తూ..ఒక్కొరొక్కరే బయటకు వచ్చారు. అన్నదమ్ములు తేరుకునేలోపే స్వామీజీల ముఠా కారులో ఉడాయించింది. దీంతో అనుమానించిన అన్నదమ్ములు పూజస్థలాన్ని పరిశీలించారు. డబ్బు లేకపోవడం, తాము ఇచ్చిన బంగారు రుద్రాక్ష మాలకు బదులు నకిలీమాల ఉండడంతో బావురుమన్నారు. అక్కడే ట్రాఫిక్ విధుల్లో ఉన్న రూరల్ పోలీసుల ద్వారా సీఐ, ఎస్ఐలకు రాజస్తానీ ముఠా మోసాన్ని తెలియజేశారు. కేసు నమోదు చేశారు. నిందితులు బెంగళూరు వైపు వెళ్లినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలడంతో పోలీసు ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి. -
బురిడీ బాబా అరెస్టు
రూ.80 లక్షల నగదు స్వాధీనం కారు, రెండు ద్విచక్ర వాహనాల పట్టివేత తిరుపతి క్రైం: లక్ష్మీపూజతో మీ దగ్గర ఉన్న డబ్బును రెండింతలు చేస్తానంటూ బురిడీ కొట్టిస్తూ నమ్మిన వారి సొమ్మును స్వాహా చేసే దొంగ స్వామీజీని తిరుపతి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 32 ఏళ్ల వయస్సున్న బుడ్డప్పగారి శివ అలియాస్ సూర్యా అలియాస్ స్వామి తన వద్ద అత్యంత శక్తులు ఉన్నాయంటూ ప్రజలను నమ్మించే వాడు. పూజా క్రమంలో ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి డబ్బులతో ఉడాయించే వాడు. బురిడీ బాబా ఆట కట్టించేందుకు పోలీసులు పట్టిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కరకంబాడి రోడ్డులోని కృష్ణారెడ్డి కోళ్ల ఫారం వద్ద అలిపిరి సీఐ రాజశేఖర్ తన సిబ్బంది, క్రైమ్ సిబ్బందితో పకడ్బందీగా కాపుకాచి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నకిలీ స్వామి అనేక మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. తిరుపతి ఆటోనగర్‌లో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారి అయిన ఆర్కే.యాదవ్ ఇంట్లో వారిని నమ్మించాడు. రూ.63 లక్షల 43 వేల 500ను పూజలో పెట్టగా పూజ అనంతరం వారికి మత్తుమందు కలిపిన ప్రసాదాన్ని తినిపించాడు. వారు మత్తులో పడిపోగానే నగదుతో ఉడాయించాడు. ఈ మేరకు ఈ ఏడా ది జూన్ 21వ తేదీ అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. బురిడీ బాబా సొంతవూరు కుప్పం మండలం వెండుగాంపల్లె. ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో నిలిపేశాడు. బాబా తొలుత ఇంట్లో డబ్బులు ఎత్తుకొని తిరుపతి, బెంగళూరు, కేరళకు వెళ్లి పలు ఆశ్రమాల్లో స్వామి వద్ద నుంచి ప్రజలను మోసగించే పద్ధతిని నేర్చుకున్నాడు. ఈ క్రమంలో 2007లో పలువురిని మోసం చేసి సుమారు రూ. 3 కోట్ల వరకు సంపాదించాడు. ఇతనిపై కర్ణాటక రాష్ట్రం కోలార్ టౌన్ పీఎస్‌లో, కోలార్ రూరల్, హోస్కోట, హన్నూరు, కమ్మలగూడ, హైదరాబాద్, కేబీహెచ్‌బీ పోలీస్స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాయి. బెయిలుపై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. అనంతరం తిరుపతికి వచ్చి యాదవ్‌ను మోసగించాడు. అదేవిధంగా నెల్లూరులోని ఆనందరెడ్డి ఇంట్లో పూజ చేసి 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. ఈ 40 లక్షలతో ఒక ఇన్నోవా కారు, ఒక హోండా యాక్టీవా, ఒక హోండా షైన్ మోటార్ సైకిలు కొన్నాడు. తిరుపతిలో నకిలీ స్వామికి సహకరించిన దామోదర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా శివ అలియాస్ స్వామి చెప్పినవ్నీ వాస్తవాలే అని పోలీసులకు తెలిపాడు. ఈ సమావేశంలో డీఎస్పీ రవిశంకర్, అలిపిరి సీఐ రాజశేఖర్, ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది ఉన్నారు. -
దొంగ స్వామీజీపై కేసు నమోదు
బెంగళూరు, న్యూస్‌లైన్ : రాసలీలలు సాగించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జ్యోతిస్కుడు దేవిశ్రీ రామస్వామి గురూజీ అలియాస్ రామస్వామి(రాము)పై స్థానిక హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాము కారు డ్రైవర్ వసంత్, మేనేజర్ ఉదయ్ తమకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. తమను చంపేస్తానంటూ రాము బెదిరిస్తున్నాడని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పలు కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. -
స్వామీజీ ముసుగులో పిల్లల అపహరణ
= పట్టుబడిన నిందితులు = పసిపాప స్వాధీనం చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : పసిపిల్లలను అపహరించి విక్రయిస్తున్న దొంగస్వామీజీ గుట్టు రట్టయింది. ఆశ్రమంపై గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి దొంగస్వామీజీ, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ పసిపాపను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.... చిక్కబళ్లాపురం సమీపంలోని బాపనహళ్లి గ్రామం వద్ద శాప విమోచన పేరుతో ఓ ఆశ్రమాన్ని శ్రీనివాస గురూజీ నిర్వహిస్తున్నాడు. స్వామీజీ వద్ద మురళీ, రీనా, కుమారి శిష్యరికం చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఆస్పత్రుల్లో సంచరిస్తూ పసిపిల్లలను అపహరించుకెళ్లి స్వామీజీకి అప్పగించేవారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా పసిపిల్లలను రూ. రెండు నుంచి రూ. నాలుగు లక్షల వరకు స్వామీజీ విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మంజునాథగౌడ పథకం ప్రకారం స్వామీజీ వద్దకు గురువారం చేరుకుని తనకు ఓ పసిపాప కావాలని అడిగారు. ఇందుకు రూ. 2 లక్షలు, మూడు టన్నుల ఇనుము, వంద సిమెంట్ బస్తాలు ఇవ్వాలని స్వామీజీ అడిగాడు. ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు రాత్రికి పోలీసులతో సహా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఓ పసిపాపను స్వామీజీ శిష్యులు తీసుకొచ్చి వారికి చూపించి, గురూజీ అడిగిన మొత్తం ఇవ్వాలని అడిగారు. అదే సమయంలో తాము పోలీసులమంటూ డీవైఎస్పీ దేవయ్య, సీఐ బాలాజీసింగ్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నయాజ్బేగ్ తెలిపి, నిందితులను అదుపులో తీసుకున్నారు. పసిపాపను స్వాధీనం చేసుకుని నిందుతులపై శుక్రవారం కేసు నమోదు చేశారు.