విడదీయకండి | Town Hall in front of the Telugu people of Karnataka | Sakshi
Sakshi News home page

విడదీయకండి

Published Fri, Dec 6 2013 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Town Hall in front of the Telugu people of Karnataka

బెంగళూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా బెంగళూరులోని టౌన్ హాల్ ఎదుట కర్ణాటక తెలుగు ప్రజా సమితి గురువారం ధర్నా నిర్వహించింది. సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి పలు సంఘ సంస్థలతో పాటు జేడీఎస్ నేత నారాయణ్, అభిల కర్ణాటక మదర్ థెరిస్సా అభిమానుల సంఘం అధ్యక్షుడు మురళీ కళ్యాణ్ తదితరులు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా బొందు రామస్వామి మాట్లాడుతూ... సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదని అన్నారు. మరో ఐదు నెలల్లో పూర్తి అయ్యే పదవులపై మమకారంతో రాష్ట్ర విభజనకు తెగబడ్డారని మండిపడ్డారు. కుట్రదారులకు ఓటుతో సమాధానం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.  

హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ వారు ఎంత పెట్టుబడులు పెట్టారో.. సీమాంధ్ర వాసులు ఎంత పెట్టుబడులు పెట్టారో.. తేల్చుకోడానికి బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.  కార్యక్రమంలో అఖిల కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర నాయకుడు కోటె సతీష్,  కేటీపీఎస్ నాయకులు బాబు రాజేంద్ర కుమార్, గురవయ్య, ముఖర్జీ, దేవదానం, శ్రీనివాసులు, కోటేశ్వరి, విజయసాయి, పాల్, నాగేష్, శివరామ్, కుమార్, నరసింహులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement