అన్నాడీఎంకే పార్టీకి చెందిన మహిళా ఎంపీ రాజ్యసభలో కన్నీరుమున్నీరయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను చెంప మీద ఎడాపెడా కొట్టిన ఆమె.. తన ప్రాణాలకు ముప్పుందని, తమిళనాడులో తనకు రక్షణ లేదని, అందువల్ల రక్షణ కల్పించాలని కోరుతూ రాజ్యసభలో కన్నీరుపెట్టారు. శనివారం నాడు ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు ఎంపీలు గొడవపడి, కొట్టుకున్న తర్వాత.. పార్టీ అధినేత్రి జయలలిత వద్దకు వెళ్లి ఆమె జరిగిన విషయం గురించి చెప్పారు.