తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించాలని ఏఐడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కోరారు. అమ్మ ఆరోగ్యంపై పార్టీ వర్గాలు చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత లేదని ఆమె అన్నారు. ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని శశికళ పుష్ప అభిప్రాయపడ్డారు.