నా భర్త ఆచూకి తెలియడం లేదు: శశికళ పుష్ప
చెన్నై: తన భర్త కోసం ఉదయం నుంచి వెతుకుతున్నానని, ఇప్పటి వరకు ఆయన జాడ కనిపించలేదని బహిష్కత ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్ప అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తనకు తెలియడం లేదని, ఆయనపై చాలా దారుణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత మృతి వెనుక శశికళ హస్తం ఉందని ఆమె మరోసారి ఆరోపించారు. బుధవారం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మీటింగ్ వద్దకు శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగన్ నలుగురు న్యాయవాదులు వెళ్లారు. అయితే, అసలు ఎవరు శశికళ పుష్ప, మీరెవరూ అంటూ ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తలు అతడిపై వారిపై దాడి చేసి రక్తం కళ్ల చూశారు. ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులు గుప్పించారు.
అనంతరం పోలీసులు వచ్చి వారిని విడిపించి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిన విషయం తెలిసినప్పటి నుంచి తన భర్త కోసం వెతుకుతున్నానని, ఆయన జాడ కనిపించలేదని అన్నారు. తాను ఇంకా అన్నాడీఎంకేలోనే ఉన్నానని, రేపటి సమావేశానికి హాజరవుతానని శశికళ చెప్పారు. మరోపక్క, జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆశా రంజన్‌కు బెదిరింపులు వచ్చాయి. ఆమె పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే ఆమెను చంపివేస్తామంటూ కొంతమంది బెదిరిస్తున్నారని ఆమె తరుపు న్యాయవాది కిస్లే పాండే చెప్పారు.