
అరెస్టు నుంచి మరో 6 వారాలు మినహాయింపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టు నుంచి మరో ఆరు వారాలు మినహాయింపునిస్తూ ఆదేశాలిచ్చింది. పుష్ప ఇంట్లో పనిచేసే ఇద్దరు.. తమపై ఆమె లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు దాఖలుచేశారు. ఈ కేసులో ఎంపీతో పాటు ఆమె భర్త, కొడుకును ఆగస్టు 22 వరకు అరెస్టు చేయొద్దని ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ హైకోర్టు గతంలో సూచించింది.
ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీని చెంపదెబ్బ కొట్టినందుకు శశికళను అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 'అమ్మ' జయలలిత ఆగ్రహానికి గురైన ఆమె సొంత రాష్ట్రం తమిళనాడుకు వెళ్లకుండా ఢిల్లీలోనే ఉంటున్నారు.