ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం రాజకీయ ఎత్తులతో విలవిల్లాడిన అన్నాడీఎంకే తాత్కా లిక ప్రధాన కార్యదర్శి శశికళ సోమవారం నుంచి దూకుడు పెంచారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యేల శిబిరంలో పన్నీర్‌సెల్వం, కేంద్రం, గవర్నర్ మీద పరోక్ష దాడి చేసిన ఆమె సోమ వారం బీజేపీ, డీఎంకే మీద నేరుగా దాడికి దిగారు. తాను వెయ్యిమంది పన్నీర్ సెల్వా లను చూశానని, తన వల్లే ఆయన మూడోసారి సీఎం అయ్యారని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. పన్నీర్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కేడర్‌లో మద్దతు లభించడంతో సోమ వారం నుంచి ఆమె కూడా జనంలోకి వెళ్లారు.